ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ చంద్ర శేఖర్ ఆజాద్ గాడి తప్పిన, భక్తులను అడ్డదారిలో దర్శనం కోసం తీసుకెళ్లే ఆలయంలో పనిచేసే సిబ్బందికి సి సి కెమెరాల నిఘా ధ్వారా, స్వీయ పర్యవేక్షణ ద్వారా దొరికినోళ్లును దొరికి నట్టు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఈఓ పరిపాలనకు, గత ఈఓల పాలనకు వ్యవత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అలవాటు పడ్డ జీవులు అక్రమంగా భక్తులను దర్శనం కోసం తీసుకుని వెళ్లి జేబులు నింపుకునే ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి ఈఓ విశ్వరూపంతో బేంబేలు ఎత్తుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, హోం గార్డులు , కోర్టు సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యాంగం వ్యవహరిస్తూ ఉన్నారానే విమర్శలు మాత్రం ఆగడం లేదు. అందువల్ల ఈఓ అలాంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. అర్చకులు, పూజార్లుకు విధులుపై అవగాహన కల్పించిన ఈఓ వారికి కూడా దశల వారీగా ఆలయం ప్రతిష్ట పెంచడానికి తగు చర్యలు చేపట్టాల్సి వుంది. ఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే ప్రక్షాళనకు నడుం బిగించి కట్టు, బొట్టు, జుట్టు వంటి సాంప్రదాయం అమలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. పాలనా పరమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఈ ఓ చంద్రశేఖర్ ఆజాద్ తాను పద్దతిగా నడుచుకుంటూ క్రమంగా సిబ్బందిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. మొత్తం మీద ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పరిపాలనా విధానాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇలాంటి ఈ ఓ మరి కొంత కాలం ఇక్కడే ఉంటే భక్తులు హాయిగా రాహు కేతు, ఆర్జిత సేవలు, అభిషేకలు చేసుకోవడం తథ్యం.
కీలుచూసి వాతవేస్తున్న ముక్కంటి ఈఓ…వరుస సస్పెండ్లతో దళారి దర్శన పార్టీల బెంబెలు
Related Posts
కూటమి ప్రభుత్వ మోసపూరిత హామీలు నమ్మొద్దు
పేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి ప్రభాత దర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): అధికారం కోసం కూటమి ప్రభుత్వం మోసపూరితమైన హామీలను ఇస్తుందని వాటిని నమ్మొద్దని సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు సంజీవయ్య అన్నారు. శనివారం ఆయన నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ గెలుపు కోరుతూ ఆయన స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి…
Read moreమున్సిపాలిటీ అభివృద్ధి చేసి చూపిస్తాం
చైర్ పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మప్రభాత దర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపాలిటీ లో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ అన్నారు. శనివారం ఆమె నాయుడు పేటలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి అంటే…
Read more