తిరుమలలో శ్రీవారి భక్తులకు రాత్రి వేళా అన్నప్రసాదంలో వడలను వడ్డింపు..!!

ప్రభాతదర్శిని, (తిరుమల-ప్రతినిధి): ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజనంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి…

Read more

తెలుగు సబ్జెక్టు మీద ఉన్న ప్రేమ.. కెమిస్ట్రీ సబ్జెక్టుపైన ఎందుకు లేదు?

ఎవరి ప్రయోజనాల కోసం లేని పోస్టును సృష్టించారు?నెల్లూరు కే ఎ సి ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు పంగనామాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) : నెల్లూరు కేఏసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వనిబంధనలకు పంగనామాలు పెట్టారు. కే ఏ సి కళాశాలలో తెలుగు సబ్జెక్టుకు రెండు పోస్ట్ ఉండగా లేని మరో పోస్టుకు నియమాకం చేసి నిబంధనలను ఉల్లంఘించారు. తెలుగు సబ్జెక్టుకు ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్స్ను నియమించి కొత్త వివాదానికి తెర…

Read more

అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం

సుపరిపాలనకు తొలి అడుగులో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. బుధవారం ఓజిలి మండలం కురుగొండ, మానమాల గ్రామాలలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత వైసిపి పాలనలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల బారిన పడవేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక లోటును అధిగమిస్తూ…

Read more

చిలకమర్రి రైతులకు న్యాయం చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్

అక్రమ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు: షాద్ నగర్ ఆర్డీఓ ఎన్ ఆర్ సరిత వెల్లడిప్రభాతదర్శిని, ( హైదరాబాద్-ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్ లతో పట్టా మార్పిడి చేసుకున్న ఉదంతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి బాధిత రైతులకు న్యాయం చేశారు. అక్రమ పద్ధతుల ద్వారా రైతులను మోసం చేసి వారి పేరిట చేసుకున్న రిజిస్ట్రేషన్…

Read more

మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి: ఎమ్మెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం పిలుపు

ప్రభాతదర్శిని, ( హైదరాబాద్-ప్రతినిధి): మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో శక్తివంతంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మహిళలది కీలకపాత్ర వహించిన చరిత్ర ఉన్నదని రాబోయే రోజుల్లో కూడా మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని ఎమ్మెస్పి. రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ కోరారు. కైతాబాద్ నియోజవర్గం హిమాయత్ నగర్ మల్లికార్జున నగర్ లో మాదిగ మాహిళ సమైక్య జిల్లా నాయకురాలు అంబిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.…

Read more

ఎమ్మెల్యే పల్లాని పరామర్శించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి): ఇటీవల ప్రమాదానికి గురై, శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డిని సోమవారం ఎంఆర్పియఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.

Read more

error: Content is protected !!