ప్రభాతదర్శిని (నాయుడుపేట – ప్రతినిధి): నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబ్బీర్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. శనివారం తన వార్డులోని ప్రతి వీధిలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నాయుడుపేట మున్సిపాలిటీ వైసీపీ చైర్మన్ అభ్యర్థి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మకు, తనకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా షేక్ షబ్బీర్ మాట్లాడుతూ, “17వ వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. డ్రైనేజీ,తాగునీరు, రోడ్ల సమస్యలను పరిష్కరించి వార్డును అభివృద్ధి బాటలో నడిపిస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను” అని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.