స్క్రూట్నీలో వైసిపి అభ్యర్థి నామినేషన్ తిరస్కరణతో…కురుగొండలో సం’కుల సమరం’ లేనట్టే!?

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలం కురుగొండ ఎంపీటీసీ స్థానానికి పోటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓజిలి మండలాన్ని షెడ్యూల్ క్యాస్ట్ జనరల్ అభ్యర్థికి ఎంపీపీ గిరిని కేటాయించింది. ఓజిలి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చిల్లమానుచేను (ఎస్సీ- మహిళ) వెంకటరెడ్డి పాలెం (ఎస్సీ జనరల్), కురుగొండ (ఎస్సీ జనరల్), స్థానాలు ఎస్సీలకు, అత్తివరం (ఎస్టి- మహిళ), భట్లకనుపూరు (ఎస్టి జనరల్) స్థానాలు ఎస్టీలకు, ఇనుగుంట (ఓసి జనరల్), గ్రద్దగుంట (ఓసి జనరల్) ఆరిమానుపాడు (ఓసి మహిళ), సగుటూరు (ఓసి జనరల్), ఓజిలి (ఓసి మహిళ) స్థానాలు కేటాయించారు. అధికార పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా ప్రస్తుత కురుగొండ పిఎసిఎస్ చైర్మన్ గా ఉన్న దారా అంకయ్యను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపద్యంలో దారా అంకయ్య అభ్యర్థిత్వాన్ని అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం విరమణ చేసిన తర్వాత దారా అంకయ్య తన రాజకీయ జీవితాన్ని స్వగ్రామమైన కురుగొండ నుండి ప్రారంభించారు. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే ఆయనకు అనుకోకుండా కురుగొండ పీఏసీఎస్ చైర్మన్ పదవి రావడం అదృష్టం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మండలంలో ఏ గ్రామంలో జరగని అభివృద్ధిని కురుగొండ గ్రామంలో అంకయ్య చేయడం ద్వారా టిడిపి అధిష్టానం దృష్టిలో పడటం విశేషం. అలాగే గ్రామంలో టిడిపికి చెందిన సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎందుకనో వారు టిడిపి కార్యక్రమాలలో హుషారుగా పాల్గొనడం లేదు అని ఆ పార్టీ శ్రేణులే చెప్పడం విశేషం. ఈ పరిణామం దారా అంకయ్యకు కలిసి వచ్చిన అవకాశం గా భావించి రాజకీయ దూకుడును ప్రదర్శించడం ద్వారా తన రాజకీయ చతురతను చాటుకున్నారు. ఈ విషయంలోనే దారా అంకయ్య గ్రామంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో కొందరికి వ్యక్తిగతంగా మరికొందరికి రాజకీయం ప్రత్యర్థిగా మారాడని చెప్పవచ్చు. అలాగే గ్రామంలో సుదీర్ఘంగా సాగుతున్న కొన్ని ఆచార సంప్రదాయాల వ్యవహారాలలో రాజకీయ జోక్యాలు చొరపడడంతో గ్రామ ఐక్యత విషయంలో వర్గ విభేదాలు చోటు చేసుకున్నట్లు కొందరు దారా అంకయ్య పై రాజకీయ ఆరోపణ చేయడం విశేషం. దీనిని దృష్టిలో పెట్టుకొని అంకయ్యను రాజకీయంగా ఓడించాలని కొందరు రాజకీయాలకు అతీతంగా కూటమి రాజకీయాలు తెరపైకి తీసుకొచ్చారు. దారా అంకయ్యకు గీటుగా రాజకీయ ప్రత్యర్థిని తీసుకొచ్చే క్రమంలో ప్రయత్నించి నామినేషన్ దాఖలు చేయించారు. ప్రధాన అభ్యర్థిగా ఉన్న వ్యక్తి నామినేషన్ ఎన్నికల అధికారులు స్క్రూట్ నిలో తిరస్కరణకు గురి అయింది. దీంతో దారా అంకయ్య పోటిపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠ కు జర పడిందని చెప్పవచ్చు. ప్రధాన అభ్యర్థి కి మద్దతుగా దాఖలు చేసిన వ్యక్తులు పోటీల్లో నిలవడం విశేషం. వీరు పోటీలో ఉంటారా లేక తప్పుకుంటారా అనే విషయంపై చర్చ జరుగుతుంది. మండలంలో పెద్ద గ్రామం అయిన కురుగొండలో ఎన్నికల ప్రచారం చేయాలన్న, తైలాలు పంచాలన్న ఖర్చుతో కూడుకున్న పని అన్న విషయం తెలిసిందే. డమ్మీ అభ్యర్థులు ఆర్థికంగా వీటిని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.
