చైర్ పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ
ప్రభాత దర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపాలిటీ లో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ అన్నారు. శనివారం ఆమె నాయుడు పేటలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో తన రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ రంగంలో అపార అనుభవం ఉన్న తన తనయుడు తంబిరెడ్డి మోహన్ రెడ్డికి టిఎంఆర్ గ్రూప్స్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అనుభవం ఉందంటూ గుర్తు చేశారు. ఆ అనుభవం నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు.తమను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇస్తే, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నాయుడుపేటను మున్సిపల్టిని కార్పొరేట్ వ్యవస్థలకు దీటుగా అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు.వైసీపీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి మాట్లాడుతూ పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు.వైసిపి పాలనలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేవని తెలిపారు. అధికార పార్టీ మోసపూరిత హామీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. నాయుడుపేట మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ తోపాటు కౌన్సిలర్ అభ్యర్థులకు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక, 22 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ధారా రవి, వైసిపి నాయకులు బైనా మల్లికార్జున్ రెడ్డి,ముత్యాల రెడ్డి, షేక్ రహంతుల్లా,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార నిర్వహించారు.
