నాన్ కాగ్నిజబుల్ నేరం పేరుతో న్యాయమూర్తికి తప్పుడు నివేదిక
జర్నలిస్ట్ హైపవర్ కమిటీ జీవో 1913 అమలు ఎస్ఐ ఆదిలక్ష్మికి వర్తించదా?
ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి:) పెళ్లకూరు మండలం అర్లపాడు ఎంపిపి స్కూల్లో వార్తల సేకరణకు వెళ్లిన జర్నలిస్ట్ గుంజి సుధాకర్ పై జరిగిన దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులను కాపాడేందుకు పెళ్లకూరు ఎస్ఐ దారం ఆదిలక్ష్మి జర్నలిస్టులకే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవ ఘటన 29-09-2026న జరిగింది. జర్నలిస్టులపై కర్రతో దాడి చేసి 50 వేలు దోపిడీ చేశారు. బాధితులు కలెక్టర్ ను కలిసిన తర్వాత 07-10-2026న బలహీన సెక్షన్లతో క్రైమ్ నంబర్ 116/2026 పెట్టారు. అయితే తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో, ఎస్ఐ 08-10-2026న అదే ఘటనపై జర్నలిస్ట్ సుధాకర్ పైనే క్రైమ్ నంబర్ 117/2026 కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇది తప్పుడు కౌంటర్ కేసు అనడానికి సాక్ష్యాలు: 29న ఘటన జరిగితే 9 రోజులు మౌనంగా ఉన్నారు. 8వ తేదీన ఆలస్యంగా ఫిర్యాదు ఇవ్వడంపై విచారణ అధికారిగా గ్రామ పెద్దల పంచాయితీ అని కట్టుకథను తెరపైకి తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ లో “పెద్ద మనుషుల పంచాయితీ” అని రాశారు. పెద్ద మనుషుల పంచాయితీ అని ఎఫ్ఐఆర్ లో రాసిన ఆదిలక్ష్మి, ఆ పెద్ద మనుషులు ఎవరో, వారి హోదా, చిరునామా, ఫోన్ నంబర్ వివరాలు ఎందుకు రాయలేదు పేర్కొనలేదు. దీన్ని బట్టి ఇది పూర్తిగా అబద్ధం అని స్పష్టంగా అర్థమవుతుంది. మరోపక్క ఫిర్యాదుదారు అర్లపాడు గ్రామం, జర్నలిస్ట్ వేరే గ్రామం. ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కట్టుబాట్లు ప్రకారం గ్రామంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదస్తులతో పెద్దమనుషుల పంచాయితీ చేసుకోవడం సహజంగా జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు వేరు వేరు గ్రామాలకు చెందిన వారు. వేరు వేరు గ్రామాలకు చెందిన వ్యక్తుల మధ్య గ్రామ పెద్దలు పంచాయితీ చేయరు. అసలు జర్నలిస్టుల విషయంలో గ్రామ పెద్దమనుషులు పంచాయితీలు చేయలేని పరిస్థితి. చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసులో పంచాయితీ, చట్టవిరుద్ధం, రాజీ కుదరదు. సాక్ష్యాలు తారుమారు… కనుకట్టు తరహాలో కేసు నమోదు: జర్నలిస్టులపై దాడికి కర్ర, ఫోటో సాక్ష్యం ఉంది. కానీ జర్నలిస్టులు కులం పేరుతో తిట్టారనడానికి ఒక్క ఆడియో, వీడియో, స్వతంత్ర సాక్షి లేడు. ఎస్ఐ ఆదిలక్ష్మి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనుకట్టు తరహాలో కేసును నమోదు చేయడం విశేషం.
జీవో 1913 ఆదిలక్ష్మికి వర్తించదా?: జర్నలిస్ట్ హైపవర్ కమిటీ జీవో 30-09-2026న ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీవో 1913 ప్రకారం జర్నలిస్టుపై దాడి జరిగితే సమాచార శాఖ డైరెక్టర్ ద్వారా హైపవర్ కమిటీకి నివేదించాలి. కానీ రెండు ఎఫ్ఐఆర్ లలోనూ జీవో ప్రస్తావనే లేకపోవడంపై చట్టాలంటే లెక్కలేని తనం, నిర్వీర్యం ఎలా చేయాలో అనే ధోరణి దీనిబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయమై జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
