ప్రభాతదర్శిని (నాయుడుపేట – ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్ పర్సన్ తోపాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు.మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి ఎస్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో జరుగునున్న ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు.ఎక్స్ అఫీషియో సభ్యులు,ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఫామ్ 2 నోటీస్ ను అందజేసినట్లు ఆయన తెలియజేశారు.