ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): దొరవారిసత్రం మండలం కల్లూరు,అనేపూడి గ్రామాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు.నాయుడుపేట పట్టణంలోనికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ల సమక్షంలో కల్లూరు మాజీ సర్పంచ్ ఇట్టిగుంట పురుషోత్తం, ఆనేపూడి మాజీ సర్పంచ్ లింగారెడ్డి వెంకటరమణారెడ్డి, గుంజు మస్తాన్ ఆధ్వర్యంలో కల్లూరు అనేపూడి గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వైసీపీ నేతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లు వారికి పసుపు కండవాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలియజేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు ఐదేళ్ల అరాచక పాలనను తుద ముట్టించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నాయకత్వంపై విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు టిడిపి కండువా కప్పుకున్న పలువురు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు, ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి విజయ్ కుమార్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గోను జకరయ్య, మాజీ ఎంపీపీ ఇట్టిగుంట రత్నయ్య,ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి డేగ ప్రసాద్,మైనారిటీ సెల్ అధ్యక్షులు షబ్బీర్ భాషా, పలువురు నాయకులు పాల్గొన్నారు.