నోరుమెదపని అధికార పార్టీ నాయకులు…పరామర్శకు కూడా నోచుకోని కుటుంబసభ్యులు!?
ప్రభాతదర్శిని (ప్రత్యేక -ప్రతినిధి): మండల కేంద్రమైన ఓజిలిలో టిడిపి సీనియర్ నాయకుడు మైలాం జయచంద్రారెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో మేనమేషాలు లెక్కిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి జయచంద్రారెడ్డి కుటుంబీలు అండదండగా ఉంటూ కష్ట కాలంలో పార్టీలు పార్టీ నాయకులను కాపాడిన సందర్భాలు ఉన్నాయి. ఏనాడు పార్టీ నుండి ఎలాంటి పదవులను ఆశించకుండా రాజకీయాలలో కొనసాగిన మైలాం కుటుంబీకులు పార్టీ అధిష్టానం ఆదేశాలు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి విస్తరణకు కృషి చేశారని చెప్పవచ్చు. మైలాం కుటుంబీకులలో రమణారెడ్డి మొదటి నుండి టిడిపికి టిడిపిలో నాయకులుగా తయారైన వ్యక్తులకు అండదండలుగా ఉండరు అని చెప్పవచ్చు. ఆయన ఏనాడు ఎలాంటి పదవులను ఆశించకుండా పార్టీ లో సాధారణ ఉన్న వ్యక్తులను నాయకులుగా తీర్చిదిద్దిన విషయంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఏనాడు పార్టీకి నష్టం కలిగించే విధంగా గాని పార్టీ మారిన సందర్భాలు గాని లేవు. ఆయన అనంతరం తన రాజకీయ సేవకుడిగా టిడిపిలో చురుకైన పాత్ర పోషించిన మైలం జయ చంద్రారెడ్డి అలియాస్ అన్నయ్య టిడిపి అన్న టిడిపి నాయకులు అన్న వల్లమాలిన ప్రేమ. టిడిపి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు కూడా పార్టీ నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఆశించకుండా పార్టీ అభివృద్ధికి కృషిచేసిన నాయకులకు కార్యకర్తలకు అండదండగా ఉంటూ అందరికీ అన్నయ్యలాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడి అద్దాంతారంగా తను చాలించవలసిన దుస్థితి వచ్చింది. ఇందుకు తెలుగుదేశం పార్టీలోనే ఓ నాయకుడు వేధింపులే మైలం జయచంద్ర రెడ్డి మృతికి కారణమన్న విషయం బహిరంగంగా తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి సామాన్య వ్యక్తిగా ఉంటూ మండల నాయకులుగా ఎదిగిన వారికి తోడ్పాటు అందించిన మైలం కుటుంబీకుల లో ఓ వ్యక్తి వేధింపులతో ఆగస్టు 20 తేదీన క్రిమిసంహార మందు తో ఆత్మహత్యకు పాల్పడిన, ఆయన ఆగస్టు 30వ తేదీన తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనపై ఆ పార్టీ నాయకులు నోరు మెదపకపోవడం విశేషం. నెలరోజులు అయిన తర్వాత కూడా అధికార పార్టీ ఏ నాయకుడు కూడా జయచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన పాపన పోలేదు. జయచంద్రారెడ్డి సజీవన రోజులలో ప్రతి పనికి ప్రతి కార్యక్రమానికి అన్నయ్య ఎక్కడున్నాడు అన్నయ్య రావాలి అంటూ వల్లమాలిని ప్రేమ వెల్లబోసిన నాయకులు నేడు వారి కుటుంబీకులను పలకరించే పరిస్థితి కూడా లేకపోవడం పార్టీ నాయకుల అవకాశవాదానికి నిదర్శనం అని చెప్పవచ్చు.
