ప్రభాతదర్శిని, నెల్లూరు (సంగం): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సంగం మండలంలోని జండాదిబ్బ మెయిన్ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (SNP) కింద లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న టేక్ హోమ్ రేషన్ (THR) వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అదేవిధంగా పోషణ్ ట్రాకర్ యాప్ మరియు బాల సంజీవని యాప్‌లలో నమోదైన ఓపెనింగ్ బ్యాలెన్స్ వివరాలను, కేంద్రంలో వాస్తవంగా అందుబాటులో ఉన్న స్టాక్ నిల్వలతో సరిపోల్చి చూశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు పలు సూచనలు చేశారు. రెండు యాప్‌లలో నమోదైన స్టాక్ వివరాలు, కేంద్రంలో భౌతికంగా ఉన్న సరుకుల నిల్వలు అన్నీ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.లబ్ధిదారులకు నాణ్యమైన పోషకాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడంతో పాటు, స్టాక్ నిర్వహణ, యాప్‌లలో డేటా నమోదు విషయంలో ఎలాంటి తేడాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ ఆకస్మిక తనిఖీలో జాయింట్ కలెక్టర్ తో పాటు ప్రాజెక్ట్ అధికారి, సంబంధిత సీడీపీవో, సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్లు పాల్గొన్నారు.