ప్రభాతదర్శిని, నెల్లూరు (సంగం): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సంగం మండలంలోని జండాదిబ్బ మెయిన్ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (SNP) కింద లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న టేక్ హోమ్ రేషన్ (THR) వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అదేవిధంగా పోషణ్ ట్రాకర్ యాప్ మరియు బాల సంజీవని యాప్‌లలో నమోదైన ఓపెనింగ్ బ్యాలెన్స్ వివరాలను, కేంద్రంలో వాస్తవంగా అందుబాటులో ఉన్న స్టాక్ నిల్వలతో సరిపోల్చి చూశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు పలు సూచనలు చేశారు. రెండు యాప్‌లలో నమోదైన స్టాక్ వివరాలు, కేంద్రంలో భౌతికంగా ఉన్న సరుకుల నిల్వలు అన్నీ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.లబ్ధిదారులకు నాణ్యమైన పోషకాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడంతో పాటు, స్టాక్ నిర్వహణ, యాప్‌లలో డేటా నమోదు విషయంలో ఎలాంటి తేడాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ ఆకస్మిక తనిఖీలో జాయింట్ కలెక్టర్ తో పాటు ప్రాజెక్ట్ అధికారి, సంబంధిత సీడీపీవో, సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్లు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.