ప్రభాతదర్శిని, తిరుపతి: జిల్లాలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టరేట్ మినీ వీసీ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డీఆర్ఓ జి. నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపరిపాలన, రెవెన్యూలకు సంబంధించి 22 ఏ, వెబ్ ల్యాండ్, రీ సర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, ఐవీఆర్ఎస్ తదితర అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దిశా నిర్దేశం చేశారు. వెబ్ ల్యాండ్ కు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశామని, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి సంబంధించి 38 సైకిల్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 37 పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మొత్తం 75 పనులు పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నామని జాయింట్ కలెక్టర్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, దేవేందర్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, సెక్షన్ సూపరింటెండెంట్స్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.