ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ఓజిలి మండలం మనవాలి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం 60 సంవత్సరాల క్రితం ఇచ్చిన అసైన్డ్‌ భూములు ఫ్రీ హోల్డ్ కు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామ టిడిపి సీనియర్ నాయకులు కమలాకర్ బాబు మోహన్ బాబు జిల్లా కలెక్టర్లు కోరారు. ఈ మేరకు వారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో వారు వినతి పత్రం సమర్పించారు. 60 సంవత్సరాల నుంచి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కుటుంబాలు ప్రభుత్వ భూములను పంపిణీ చేశారని తెలిపారు. ఆయా భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని నాయకులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీ-సర్వేలో మనవాలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన భూములను 22-ఏ జాబితాలో చేర్చడం, ఫ్రీహోల్డ్‌ జాబితాలో నమోదు చేయకపోవడం వల్ల రైతులు భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వారు కలెక్టర్ కు వివరించారు.ఈ సమస్యను పరిష్కరించాలని, తద్వారా ఆయా వర్గాలు అభివృద్ధికి దోహదం చేసిన వారవుతారని కోరుతూ టీడీపీ సీనియర్‌ నాయకులు నల్లమేకల కమలాకర్‌ బాబు, రామ బత్తిని మోహన్ బాబు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.