కమిషనర్ గారు… కబ్జాదారులకు కళ్లెం వేయండి ప్రభాతదర్శిని,(నాయుడుపేట ప్రతినిధి):రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నాయుడుపేటలో మున్సిపల్ ఆస్తులు భూములు యదేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి.ముఖ్యంగా పారిశుద్ధ్యం కి ఇబ్బంది కలిగించే విధంగా కొందరు మురికి కాలువలను దర్జాగా కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు.మొదట చిన్న బంకులుగా షెడ్డులుగా ఆక్రమాలు మొదలుపెట్టి క్రమంగా శాశ్వత కట్టడాలకు పూనుకుంటున్నారు. నాయుడుపేటలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించిన కొందరు అక్రమ దారులు దర్జాగా కబ్జా చేస్తున్నారు.సిబ్బంది సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో ఈ ఆక్రమాలు జోరు అందుకుంటున్నాయని విమర్శలు ఉన్నాయి.నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని బజార్ వీధి నుండి, కొన్ని దశాబ్దాలుగా రైల్వే బ్రిడ్జి సమీ ప్రాంతంలోకి మురికి నీటి కాలువ ద్వారా మురికి నీరు ప్రవహిస్తూ ఉన్నాయి.గత కొన్ని సంవత్సరాల నుండి జువ్వలపాలెం పోవు రోడ్డు బ్రిడ్జి సమీప ప్రాంతంలో కొంతమంది మురికినీటి కాలవను కబ్జా చేసి ఆక్రమించి మురికి నీటి కాలువను పూడ్చేసి దర్జాగా ఇల్లు నిర్మించుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు.మురికి నీరు పోవు మురికి నీటి కాలువను కబ్జా చేసి అక్రమ కట్టడాలను కట్టడంతో మురికి నీరు కాలువలో నిలబడి చెత్తా చెదారం అనుకుని ఉండడంతో దోమల నిలబడి సమీప ప్రాంతంలో ఉన్న శ్రీ రామ్ నగర్,జువ్వలపాలెం రోడ్డు ప్రాంతంలో ఉన్న ప్రజలు దోమలతో దండయాత్ర చేస్తూ నరకయాతన,అనుభవిస్తున్నారు. నాయుడుపేట మున్సిపల్ అధికారికి మురికి నీటి కాలువ పై కట్టిన అక్రమ కట్టడాలు కంటికి కనబడవా?మురికి నీటి కాలువ పై కట్టిన కట్టడాలు ఎందుకు తొలగించడం లేదు?అక్రమ కట్టడాలు మునిసిపల్ అధికారుల కనుసెగల్లో జరుగుతున్నట్టు పెద్ద ప్రసారమే జరుగుతుంది. నాయుడుపేట మునిసిపల్ పరిధిలో ప్రభుత్వ భూములు,కాలవ గట్లు మొదలగున్నవి ఎన్నో కబ్జాకు గురవుతుంటే నాయుడుపేట మున్సిపల్ అధికారులు నిద్రమత్తులో ధన దాహంతో దోచుకుంటూ కాలయపనతో పబ్బం గడుపుతున్నారు.సంబంధిత జిల్లా అధికారులు నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పర్యటించి కబ్జాకు గురవుతున్న కాలవలు ప్రభుత్వ భూములను సర్వే చేసి అక్రమ కట్టడాలకు అడ్డుకట్టు వేసి మురికి నీటి కాలవ పై కట్టిన అక్రమ దుకాణాలను,ఇల్లును తొలగించి, కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడి మురికి నీటి కాలువ మరమ్మత్తు పూడిక తీత పనులను చేపట్టి కాలువకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని సమీప ప్రాంత ప్రజలు కోరుతున్నారు.