ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ఓజిలి మండలం మనవాలి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం 60 సంవత్సరాల క్రితం ఇచ్చిన అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ కు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామ టిడిపి సీనియర్ నాయకులు కమలాకర్ బాబు మోహన్ బాబు జిల్లా కలెక్టర్లు కోరారు. ఈ మేరకు వారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో వారు వినతి పత్రం సమర్పించారు. 60 సంవత్సరాల నుంచి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కుటుంబాలు ప్రభుత్వ భూములను పంపిణీ చేశారని తెలిపారు. ఆయా భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని నాయకులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీ-సర్వేలో మనవాలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన భూములను 22-ఏ జాబితాలో చేర్చడం, ఫ్రీహోల్డ్ జాబితాలో నమోదు చేయకపోవడం వల్ల రైతులు భూములను రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వారు కలెక్టర్ కు వివరించారు.ఈ సమస్యను పరిష్కరించాలని, తద్వారా ఆయా వర్గాలు అభివృద్ధికి దోహదం చేసిన వారవుతారని కోరుతూ టీడీపీ సీనియర్ నాయకులు నల్లమేకల కమలాకర్ బాబు, రామ బత్తిని మోహన్ బాబు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.