
అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు ఫ్లకార్డులు ప్రదర్శించడం విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? ఏపీ పోలీసుల వ్యవహారశైలి పై హైకోర్టు మండిపాటు పోలీసుల తీరుతో మాకు బీపీ పెరుగుతోందని వ్యాఖ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఏపీ పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభుత్వం పెద్దల మెప్పుకోసం పనిచేయొద్దని, అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించింది. ఫ్లకార్డులు ప్రదర్శించడం విద్వేషాలు రెచ్చగొట్టం ఎలా అవుతుందని పోలీసుల వ్యవహారశైలి నుంచి ప్రశ్నించింది. పోలీసులు చాలా క్యాజువల్‌గా కేసులు పెట్టి, వాంగ్మూలాలు సృష్టిస్తున్న పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే తమకు బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరిగిపోతోందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక కేసులో ఎవరో ఒకరిని అరెస్టు చేయాలన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిపడింది. కేసుల విషయంలో పోలీసులు కొత్త కొత్త పద్దతులు కనిపెడుతున్నారని, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పని చేయొద్దని, పరిధి దాటి పనిచేస్తే.. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఎవరూ మిమ్మల్ని కాపాడరని సున్నితంగా హెచ్చరించింది.మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమకుమార్ అరెస్టుపై ఆయన కుమారుడు హైకోర్టు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుపై సీరియస్ అయ్యింది. పోలీసులకు కీలక సూచనలు చేసింది. పెద్దల మెప్పుకోసం కాకుండా.. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్‌కు లోబడి పనిచేయాలని సూచించింది. పోలీసులు ఏం చేస్తున్నా.. కోర్టు చూస్తూ ఊరుకుంటుందని భ్రమ నుంచి బయటకు రావాలని సూచించింది. తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేయడం తప్పు కాదని, కానీ, అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు అని కోర్టుఅభిప్రాయపడింది.ఫ్లకార్డులు ప్రదర్శించడం విద్వేషాలు రెచ్చ గొట్ట డమా,మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమకుమార్ అరెస్టుపై కోర్టు తీవ్రంగా స్పందించింది.ప్రేమ కుమార్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా?అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసాఇది? అని ప్రశ్నించింది.నాటకరూపంలో ప్రభుత్వాన్ని సెటైరికల్‌గా విమర్శించినందుకు కేసు పెడితే ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఏపీ హైకోర్టు అభిప్రాయ పడింది.ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించడం తప్పా.? అని పోలీసులను కోర్టు నిలదీసింది.ఇది విద్వేషాలను రెచ్చగొట్టడం అవుతుందా.? అని ప్రశ్నించింది.కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటు గా వ్యాఖ్యానించింది.అరెస్టు రికార్డులను మా ముందు ఉంచండి.సోషల్ మీడియాలో ప్రేమ్‌కుమార్ రీల్ చూసి ఫిర్యాదు చేస్తే వెంటనే ఎలా రియాక్ట్ అవుతున్నారు.? వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్చడ్డారంటూ కేసు పెడతారా? అరెస్టు సమయంలో పోలీసులు రికవరీ చేసింది రూ.300 మాత్రమేనని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ప్రేమ్‌కుమార్ అరెస్టు రికార్డులను తమకు అందించాలని కర్నూలు పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునం దర్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.