ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో టాపర్ కొత్తనూరు వైష్ణోదేవి నిలిచారు. ప్రముఖ సినీ, సీరియల్ నటుడు శ్రీహరి- లలితభవాని దంపతుల కుమార్తె అయిన వైష్ణోదేవి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ లోని ఏ.ఎస్.రావు నగర్ భాష్యం స్కూల్ చదివింది. 10వ తరగతిలో 9.5 జిపిఏ మార్కులు సాధించారు. హైదరాబాద్ మణి కొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ బ్రాంచ్ లో ఇంటర్మీడియట్ లో 995 /1000 మార్కులు సాధించి తెలంగాణ స్టేట్ టాపర్ నిలిచింది. ఈ సందర్భంగా చైతన్య విద్యా సంస్థ నిర్వాహకులు వైష్ణోదేవి ని ఘనంగా సన్మానించారు. తమ విద్యార్థి తెలంగాణ రాష్ట్రంలో టాపర్ గా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.
నాయుడుపేటలో 32 మంది అభ్యర్థులూ మనవారే… పరిచయ వేదికలో తంబిరెడ్డి మోహన్ రెడ్డి
కౌన్సిలర్ల పరిచయ వేదికలో తంబిరెడ్డి మోహన్ రెడ్డిప్రభాతదర్శిని, నాయుడుపేట-ప్రతినిధి: సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన జరిగిన కౌన్సిలర్ల పరిచయ చర్చావేదికలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలో గెలిచినవారు, ఓడినవారు అనే తేడా లేదని, 32 మంది అభ్యర్థులూ మనవారేనని అన్నారు. నాయుడుపేటలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంప్ కార్యాలయంలో నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఒకే వేదికపై సత్కరించి…
భద్రతా వైఫల్యమే శ్రీకాళహస్తి ఆలయంలో అగ్ని ప్రమాదం:అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆనం ఆగ్రహం
ప్రభాతదర్శిని, శ్రీకాళహస్తి-ప్రతినిధి: శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అదనపు లడ్డూ పోటులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం మంత్రి ఆనం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం…