100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ర్యాంకు సాధించిన వి.శ్రీహాసిని కరస్పాండెంట్ పి శ్రీనివాసులు రెడ్డి అభినందనలు
ప్రభాతదర్శిని, (నాయుడు-పేట ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థిని వి.శ్రీహాసిని స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే శ్రీ వేమ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించారు.దీనితో శ్రీ వేమ జూనియర్ కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా శ్రీ వేమ జూనియర్ కళాశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 32ఏళ్లుగా తమ కళాశాల విద్యార్థులు స్టాండర్డ్ ఫలితాలను సాధిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారని తెలియజేశారు.కళాశాల స్థాపించినప్పటి నుంచి 32 ఏళ్లుగా అనేక మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో రాణిస్తున్నారని తెలియజేశారు. అత్యుత్తమ శిక్షణకు,ఉన్నత ఫలితాలకు శ్రీ వేమ జూనియర్ కళాశాల ప్రత్యేక గుర్తింపు సాధించినట్లు తెలియజేశారు. క్రమశిక్షణతో, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను అందించడం ద్వారా తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేశారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో 992 మార్కులతో శ్రీ హాసిని స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. అలాగే ఎంపీసీ గ్రూప్ లో బి. సాయి శ్రావణి 988,బి. శ్రేయ 988,బి. నేహశ్రీ 987,వి. శ్రీ హర్షిణీ 987,కె. జాహ్నవి 987,వై. కీర్తన 985,ఎ. వేణు 984,సిహెచ్. సుప్రియ 984,టి. ఆదిత్య 883, ఆర్.సిరి 981, టి. అక్షయ 981, పి. రేష్మ 981, ముని పుష్యంత్ 981,కె. అక్షయ 980,బి. తేష్ణి శ్రీ 978, పి మౌనిష్ 978, ఏ మూనిత నూజ 972, ఒ.హిమబిందు 972, వై హేమ తేజ 970, ఎన్. అఖిల 967, కే పద్మజ 967, ఎస్ నాగశ్రీ చరిత 966, బి రిషిత 950, షేక్ ముషీర్ 965, టి గురు శృతి 961, ఎస్విఎల్ మౌనిక 960, ఎం మునిరాజా 958, పి గురు సుజన్ 965, జి మహిత 955, ఆర్ .సహాని 951, ఎస్ .కారుణ్య హాసిని 950, ఎస్ సంజు శ్రీ 950, పి. శశిధర్ రెడ్డి 950 మార్కులు సాధించినట్లు తెలియజేశారు. అలాగే బైపిసి లో పి. ఫ్రైజి 985 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించినట్లు తెలిపారు.షేక్. అజ్రా అంజు975, షేక్ ముని బా అంజుం961 మార్కులు సాధించారన్నారు. ఎం ఇ సి లో టి ఐశ్వర్య 931, టి భవ్య శ్రీ స్వాద్విక 885 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే సీఈసీ లో మునిగంగాధర్ 858 మార్కులు సాధించినట్లు తెలిపారు. జూనియర్ ఎంపీసీ గ్రూప్ లో ఓ. కేతన్ 464, కే వెంకట హర్షిత 464, ఎల్ లహరి 462, ఎం నవీన్ 462, ఎం రాకేష్ 462, ఎం రామ్ చరణ్ 460, డి హేమంత్ 459, బి అభిషేక్ 459, ఏ మేఘన 459, జి లోకేష్ 458, జి స్వప్న 457, ఎన్ వెంకట అనిరుద్ 457, ఎన్ తిరుమల 455, షేక్ అబ్దుల్ ని స్సార్ 455, ఏ లాస్య 454, ఎన్ నిరంజన్ 453, ఎక్కడలేవు జి రాజేశ్వరి 452, వి యశ్వంత్ రెడ్డి 452, ఆర్ పుష్పాంజలి 452, కే ప్రణవి 450, ఎ. కల్పన 449, సి చంద్ర లాస 447, టి లక్ష్మీ ప్రసన్న 446, రిషికా రాజ్ 445, ఆర్ చాందిని 445, షేక్ జాస్మిన్ 444, సి. యశస్విని 440, ఎన్ ఇందుప్రియ 439, ఎం వెంకట అఖిల 438, మీ తరుణ్ తేజ్ 436, ఆదిత్య భామ్మె434, ఏ స్నేహ 427, వి జోషిత 423, ఎం హేమంత్ 423, కే జితేంద్ర 421, షేక్. జువేరి య భాను 420, ఎస్ రూప 420 మార్కులు సాధించారని తెలియజేశారు అలాగే జూనియర్ ఇంటర్ బైపీసీలో ఎం చంద్రకళ 450, బి హరిప్రియ 448, సిహెచ్ నిఖిత 441, ఎం లక్ష్మి ప్రణవి 439, జి నాగ లాస్య 436, కె సుమ కావ్య 434, పి సంజన 426, పి వైష్ణవి 424, పి శృతి 418, మెర్లిన్ మోసెస్ 416, ఎం . ఉష్రా బాను408, పి లాస్య 402 మార్కులు సాధించారని తెలియజేశారు. సీఈసీ లో సిక్ సోఫియా 448, పి సూర్య 439, టి నవీన 408 మార్కులు సాధించారని తెలిపారు.ఎం ఇ సి లో షేక్. జాస్మిన్ 454 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించినట్లు తెలియజేశారు. తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి కృష్ణయ్య, అధ్యాపకులు సిహెచ్ కృష్ణయ్య, ఎల్ హరినాథ్, డి ముని చంద్రశేఖర్, డి వెంకటేశ్వరరావు, కే శ్రీనివాసులు, పి శివప్రసాద్, డి పెంచలయ్య , విద్యార్థులు పాల్గొన్నారు.
