ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బికే వెంకటేశులు గురువారం బాధ్యతలు తీసుకున్నారు.అంతకు ముందుకు ఈఓ వెంకటేశులు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధానంలో శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈఓలుగా పని చేసిన అధికారులు వారి ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటే కొత్త ఈఓ వెంకటేశులు శ్రీ గురు దక్షిణామూర్తి విగ్రహం ఎదుట బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు నాగరాజు, రాఘవయ్య, డిఈఓ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈవో మోహన్, ఏఈవో హేమామాలిని, ఏఈవో లోకేష్ బాబు, పర్యవేక్షకులు నాగభూషణం, రవి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, పురోహితులు అర్ధగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.
నాయుడుపేట మున్సిపాలిటీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపాలిటీ కి జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు ఓటర్లు వేసిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికలో మొత్తం 37,100 మంది ఓటర్లు ఉండగా 27,509 ఓట్లు పోల్ అయ్యాయి, అందులో 581 ఓట్లు చెల్లలేదు, 26,928 ఓట్లు చెల్లాయి. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు 13,787 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ అభ్యర్థి…
సీఐ తురక వెంకటరమణ ఆగడాలపై ఎన్నికల సంఘానికి మున్సిపల్ చైర్ పర్సన్ ఫిర్యాదు
నాయుడుపేట సీఐపై విచారణ చేపట్టాలని డీజీపీకి ఎన్నికల సంఘం ఆదేశం ప్రభాతదర్శిని, నాయుడుపేట (ప్రత్యేక ప్రతినిధి): వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న తురక వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ పనితీరుపై విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసుల వ్యవహారశైలి తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన పోలీసులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న…