
ప్రభాతదర్శిని, (నాయుడుపేట- ప్రతినిధి):రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు అభినందించారు.విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన అధ్యాపకలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో విద్యార్థుల పరీక్ష ఫలితాల వివరాలను తెలియజేశారు. బుధవారం విడుదలైన జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఐదు గ్రూపులకు గాను నాలుగు గ్రూపుల్లో టౌన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యాసంస్థ విక్రమ్ జూనియర్ కళాశాల అని పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపిసి గ్రూప్ లో వి కావ్యశ్రీ 984, కె మన్య 982, బి తేజస్విని981, వి సాయిశివప్రియ980, వి ముని భావన980 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సీనియర్ బైపిసి గ్రూప్ లో ఎస్ కె సమీరా 980,మరియం నిషా 971 మార్కులు సాధించారన్నారు. సిఇసి గ్రూప్ లో ఎస్ కె అలియా 890, టి సుచిత్ర 885,ఎస్.కె మల్కిఇలైహెరా 867, ఎంఇసి విభాగంలో ఎన్ హాసిని 885 మార్కులు సాధించినట్లు తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపిసి గ్రూప్ లో డి సాయి కిరణ్ రెడ్డి 464 మార్కుల తో టౌన్ ఫస్ట్ సాధించారని .ఎస్.కె సమీర్ 461, ఎం యశ్వంత్ 461, జి హేమశ్రీ 460, విశాల్ పటేల్ 460 మార్కులు సాధించారని తెలియజేశారు. జూనియర్ బైపిసి గ్రూప్ లో ఎం నీలిమ 432, డి అక్షయ 427,కె ఉమ 410 మార్కులు సాధించారని తెలియజేశారు.ఎంబైపిసి గ్రూప్ లో జి చరిష్మా 423 మార్కులతో టౌన్ ఫస్ట్,ఎస్ కె షీబా 417 మార్కులు సాధించారన్నారు. సిఇసి గ్రూప్ లో ఎస్ ప్రసన్న 483 మార్కులతో టౌన్ ఫస్ట్,ఎం శ్రీజ 464 మార్కులు సాధించారని తెలిపారు.ఎంఇసి గ్రూప్ లో ఎస్ కె సల్మాన్ 476 అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించినట్లు తెలియజేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో ఉత్తమ విద్యను అందించి అత్యుత్తమ ఫలితాలు తమ కళాశాల సాధిస్తున్నట్లు తెలియజేశారు.తమ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో అధ్యాపకుల కృషి ఎనలేనిదన్నారు.రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులను ప్రోత్సహించి,వచ్చే ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించగలమని కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఆశ బావ వ్యక్తం చేశారు.
