ప్రభాతదర్శిని, (సత్యవేడు- ప్రతినిధి): సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గెలుపుతో పుత్తూరు టీబీ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో లక్ష్మణ్ రాజు తమ మొక్కుబడిని తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పుత్తూరుకు చెందిన లక్ష్మణ రాజు సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం విజయం సాధిస్తే షిర్డి సాయినాథునికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటానని మొక్కుకున్నారు. సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం గెలుపొందడంతో శనివారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి పుత్తూరు టీబీ రోడ్డులోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయానికి లక్ష్మణ రాజు చేరుకొని స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రాజు, టిడిపి సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, అములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఓట్లకు, పదవుల కోసం అందరూ… ప్రజా సేవకు అందుబాటులో ఉండేది ఎందరు?
ప్రభాతదర్శిని, ప్రతినిధి: పంచాయతీ ఎన్నికల సందడి ప్రతి గ్రామంలో మొదలైంది, ప్రతి వీధిలో అభ్యర్థులు తిరుగుతున్నారు, ఇంటింటికీ వెళ్లి నమస్కారాలు చేస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, గ్రామాభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు, కానీ గ్రామస్తుల మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న మెదులుతోంది, ఎన్నికలప్పుడు కనిపించే ఈ నాయకులు గెలిచాక కూడా కనిపిస్తారా, ప్రజలకు అందుబాటులో ఉంటారా, ఫోన్ చేస్తే స్పందిస్తారా, సమస్య చెబితే పరిష్కరిస్తారా అని,…
నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ ప్రమాణస్వీకారం నేడు
ప్రభాతదర్శిని (నాయుడుపేట – ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్ పర్సన్ తోపాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు.మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి ఎస్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో జరుగునున్న ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు.ఎక్స్ అఫీషియో…