ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

నెల్లూరు నూతన మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ ప్రభాతదర్శిని, (నెల్లూరు-కార్పొరేషన్ ప్రతినిధి): నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కమిషనర్ మల్లవరపు సూర్య తేజ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా…

Read more

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సేవలో గవర్నర్ రాధాకృష్ణన్

ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ కు టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టిటిడి అధికారులు గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపల గవర్నర్ కు బిజెపి నాయకుల గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి…

Read more

నిషేధిత పదార్థాలు తరలిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ ఎం. సూర్య నారాయణ రెడ్డి ప్రభాతదర్శిని,(గూడూరు -ప్రతినిధి): నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు, హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆపి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు…

Read more

ధ్యాన చంద్ర, అదితి సింగ్ లు జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివి

వీడ్కోల సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వెళ్తున్న ధ్యాన చంద్ర మరియు కడప జిల్లా జెసి గా బదిలీపై వెళ్తున్న తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ చేసిన సేవలు అమూల్యమైనవి అని, సమర్థవంతమైన అధికారులు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఎస్. వెంకటేశ్వర్  కొనియాడారు. మంగళవారం…

Read more

కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి హేళనగా మాట్లాడరు

యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబుప్రభాతదర్శిని, (యర్రగొండపాలెం-ప్రతినిధి):కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి చెడుగా మాట్లాడరని, నోరు ఉందికదా అని ఎలా పడితే ఆలా మాట్లాడితే ఊరుకోబోం – నోరుజారితే చట్టపరమైన చర్యలు తప్పవని  యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హెచ్చరించారు. మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే…

Read more

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ,ఎస్ఐ సస్పెండ్:డి.ఐ.జి. విజయారావు

ప్రభాతదర్శిని (కర్నూలు -ప్రత్యేక ప్రతినిధి):విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలపై డి.ఐ.జి. విజయారావు వేటు వేశారు. నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు ఉద్యోగులను కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు బుధవారం సస్పెండ్ చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు…

Read more

నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలం: జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్ వెంకటేశ్వర్

యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలిప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైన జిల్లా అని జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్ వెంకటేశ్వర్ పరిశ్రమల శాఖ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం…

Read more

కోనేటి ఆదిమూలం గెలుపుతో మొక్కులు చెల్లించుకున్న లక్ష్మణ్ రాజు

ప్రభాతదర్శిని, (సత్యవేడు- ప్రతినిధి): సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గెలుపుతో పుత్తూరు టీబీ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో లక్ష్మణ్ రాజు తమ మొక్కుబడిని తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పుత్తూరుకు చెందిన లక్ష్మణ రాజు సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం విజయం సాధిస్తే షిర్డి సాయినాథునికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటానని మొక్కుకున్నారు. సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం గెలుపొందడంతో…

Read more

ఆక్రమణలో ఉన్న ఐదు కోట్ల ప్రభుత్వ స్థలం స్వాధీనం

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆక్రమణలో ఉన్న ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆ ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సేకరించిన సమాచారం, అధికారుల వివరాల ప్రకారం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్ద ఎల్ ఏ సాగరం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్…

Read more

error: Content is protected !!