ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేటకు చెందిన విద్యుత్ శాఖ విశ్రాంత ఏ డి ఇ లింగారెడ్డి జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను లింగారెడ్డి జయప్రకాష్ రెడ్డి (అమెరికా) నాయుడు పేట కు చెందిన బాల్యమిత్రుల బృందం పరామర్శించారు.బుధవారం నాయుడుపేట పట్టణంలో జరిగిన జయరామిరెడ్డి ఉత్తర క్రియల కార్యక్రమాల్లో చిన్ననాటి బాల్య మిత్రుల బృందం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన జయరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు లింగారెడ్డి భాను ప్రకాష్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి లతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాల్య మిత్రుల బృందం ఓడూరు గిరిధర్ రెడ్డి, కామిరెడ్డి మోహన్ రెడ్డి, గాదిరెడ్డి చక్రధర్, పులి వెంకటేశ్వర్లు, ఓడూరు ముని క్రిష్ణారెడ్డి, పిండూకూరు రాజశేఖరరెడ్డి, నల్లపనేని జనార్ధన్, ఉన్నం మురళి ప్రసాద్, మోహన్, ఆనం శ్రీనివాసులు, అల్లెయ్య, పెనుకొండ అశోక్, నరసిహూలు, బొడ్డు ప్రసాద్, కామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, బత్తేయ్య, కేశం హరిబాబు, అన్నేమనేని రామకృష్ణ, గుండాల సురేష్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.