ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. ఓజిలి మండలంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిలివేటి సంజీవయ్య , సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు బీరదవలు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయడం, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై నాయకులకు సంజీవయ్య దిశానిర్దేశం చేశారు. కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల కోసం పార్టీ నిరంతరం పోరాడుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు. బీరదవలు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండల, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం మండల, గ్రామస్థాయిలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి , రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి దేశిరెడ్డి మధు రెడ్డి, సీనియర్ నాయకులు కొండూరు వెంకట సుబ్బరాజు, కొండూరు దామోదరాజు, ప్రసాద్, బట్ట పృథ్వి కృష్ణ, బట్ట అనిల్ కుమార్ యాదవ్ ,ఓజిలి మాజీ ఎంపీపీ గడ్డం అరుణమ్మ , మాజీ సర్పంచ్ మౌనిక రెడ్డి,పాకనాటి ప్రవీణా, ఖాదర్ బాషా , ప్రభాకర్ రాజు , పిండుకూరు మధుసూదన్ రెడ్డి తదితర పాల్గొన్నారు.
