వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలి

నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): నెల్లూరు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సహకారశాఖ అధికారులను ఆదేశించారు.జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పిఎసిఎస్‌ల సామర్థ్యం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 78 పిఎసిఎస్‌లను నాబార్డు జాతీయ సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్కుకు అనుసంధానం చేసిందని, అందువల్ల…

Read more

తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా బుధవారం ఉదయం శుభం భన్సల్ జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి…

Read more

ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

నెల్లూరు నూతన మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ ప్రభాతదర్శిని, (నెల్లూరు-కార్పొరేషన్ ప్రతినిధి): నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కమిషనర్ మల్లవరపు సూర్య తేజ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగర…

Read more

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కి బీజేపీ నేతల విజ్ఞప్తి ప్రభాతదర్శిని,(కోట – ప్రతినిధి): గూడూరు డివిజన్లో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కోట, వాకాడు మండలాల కు చెందిన బిజెపి నాయకులు కోరారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిని సోమవారం…

Read more

సాగు, త్రాగు నీటి సమస్యలు తీర్చండి సారూ….

కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలిసి.ఎం.చంద్రబాబు, మంత్రి లోకేష్ తో చర్చించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): కందుకూరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సచివాలయంలో ఇద్దరినీ విడివిడిగా కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు.…

Read more

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సేవలో గవర్నర్ రాధాకృష్ణన్

ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ కు టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టిటిడి అధికారులు గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపల గవర్నర్ కు బిజెపి నాయకుల గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని…

Read more

నిషేధిత పదార్థాలు తరలిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ ఎం. సూర్య నారాయణ రెడ్డి ప్రభాతదర్శిని,(గూడూరు -ప్రతినిధి): నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు, హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆపి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు…

Read more

ధ్యాన చంద్ర, అదితి సింగ్ లు జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివి

వీడ్కోల సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వెళ్తున్న ధ్యాన చంద్ర మరియు కడప జిల్లా జెసి గా బదిలీపై వెళ్తున్న తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ చేసిన సేవలు అమూల్యమైనవి అని, సమర్థవంతమైన అధికారులు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఎస్. వెంకటేశ్వర్  కొనియాడారు. మంగళవారం ఉదయం…

Read more

కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి హేళనగా మాట్లాడరు

యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబుప్రభాతదర్శిని, (యర్రగొండపాలెం-ప్రతినిధి):కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి చెడుగా మాట్లాడరని, నోరు ఉందికదా అని ఎలా పడితే ఆలా మాట్లాడితే ఊరుకోబోం – నోరుజారితే చట్టపరమైన చర్యలు తప్పవని  యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హెచ్చరించారు. మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి…

Read more

error: Content is protected !!