రాజకీయాలకు అతీతంగా జల వివాదాలను పరిష్కరించుకుందాం: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య

ఏపీ ఒక అడుగు వేస్తే, తెలంగాణ పది అడుగులు వేస్తుంది ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా…

Read more

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త ను హత్య చేసిన భార్య

ప్రభాతదర్శిని, (మెదక్-ప్రతినిధి): మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొల్లెబోయిన స్వామి (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతని భార్య ప్రియుడితో కలసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. శుక్రవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగాకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 23న నేరెళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో స్వామి డెడ్బాడీ కనిపించగా, తన…

Read more

చిలకమర్రి రైతులకు న్యాయం చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్

అక్రమ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు: షాద్ నగర్ ఆర్డీఓ ఎన్ ఆర్ సరిత వెల్లడిప్రభాతదర్శిని, ( హైదరాబాద్-ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్ లతో పట్టా మార్పిడి చేసుకున్న ఉదంతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి బాధిత రైతులకు న్యాయం చేశారు. అక్రమ పద్ధతుల ద్వారా రైతులను మోసం చేసి వారి పేరిట చేసుకున్న రిజిస్ట్రేషన్…

Read more

మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి: ఎమ్మెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం పిలుపు

ప్రభాతదర్శిని, ( హైదరాబాద్-ప్రతినిధి): మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో శక్తివంతంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మహిళలది కీలకపాత్ర వహించిన చరిత్ర ఉన్నదని రాబోయే రోజుల్లో కూడా మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని ఎమ్మెస్పి. రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ కోరారు. కైతాబాద్ నియోజవర్గం హిమాయత్ నగర్ మల్లికార్జున నగర్ లో మాదిగ మాహిళ సమైక్య జిల్లా నాయకురాలు అంబిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.…

Read more

ఎమ్మెల్యే పల్లాని పరామర్శించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి): ఇటీవల ప్రమాదానికి గురై, శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డిని సోమవారం ఎంఆర్పియఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.

Read more

ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ టాపర్ వైష్ణోదేవి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో టాపర్ కొత్తనూరు వైష్ణోదేవి నిలిచారు. ప్రముఖ సినీ, సీరియల్ నటుడు శ్రీహరి- లలితభవాని దంపతుల కుమార్తె అయిన వైష్ణోదేవి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ లోని ఏ.ఎస్.రావు నగర్ భాష్యం స్కూల్ చదివింది. 10వ తరగతిలో 9.5 జిపిఏ మార్కులు సాధించారు. హైదరాబాద్ మణి కొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ బ్రాంచ్ లో…

Read more

కోర్టుకు హాజరవుతారా? జైలుకు పంపమంటారా?

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం? ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్ ను తీవ్రంగా మందలించింది.తనకున్న…

Read more

ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా మారాలి: రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ డాక్టర్ సుజాతా రావు

ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే రాజకీయ పార్టీలకి ఓటు వేయవద్దు:డాక్టర్ పివి రమేష్ పిలుపు ఆరోగ్యం సామాజిక బాధ్యత’ తిరుపతి సదస్సులో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ లుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): దేశంలో ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కుగా మారాలని, భారత ప్రభుత్వ పూర్వ ఆరోగ్య కార్యదర్శి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. సుజాతారావు అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వేమన విజ్ఞాన…

Read more

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం…కన్న కూతురు పెండ్లి జరుగుతుండగా.. పెండ్లి మండపంలోనే గుండెపోటు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):కాళ్లు కడిగి బిడ్డ కన్యాదానం చేయాల్సిన తండ్రి.. అప్పటివరకు హుషారుగా బిడ్డ పెండ్లి పనుల్లో మునిగి తేలాడు.. బంధువులను ఆహ్వానించారు. కళ్యాణ మండపమంతా కలియ తిరిగి పెళ్లి పనులు చూసుకున్నాడు. అయితే ఇంతలోనే మాయదారి గుండెపోటు..అప్పటివరకు హుషారుగా తిరిగిన వ్యక్తి కుప్ప కూలాడు. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. కన్న కూతురు పెండ్లి జరుగుతుండగా.. పెండ్లి మండపంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు ఓతండ్రి. ఆస్పత్రికి తరలించినా…

Read more

సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆర్టిఐ కమిషనర్ లను నియమించాలి

సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధంతెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ఏకగ్రీవంగా ఎన్నికప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ను నియమిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మాట్లాడుతూ…

Read more

error: Content is protected !!