ముక్కంటి ఆలయంలో త్వరలో నగదు రహిత సేవలు

దళారులకు చెక్ పెడతాం: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి-ప్రతినిధి):ప్రముఖ రాహు – కేతు నివారణ క్షేత్రం, విశిష్ట శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దళారీ బెడద నుండి భక్తులను కాపాడేందుకు వీలుగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలో నగదు రహిత పూజాలను, నిత్య పూజలు, ఆర్జిత సేవలను, అతిథి గృహాలను భక్తులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్…

Read more

మురికి నీరు పొయ్యొద్దన్నందుకు మూకుమ్మడిగా దాడి చేశారు

మాచవరం సర్పంచ్ భర్త పై టిడిపి నాయకులు దాడి ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): తమ నివాస ప్రాంతం వద్ద మురికి నీరు పోయిద్దు అని అన్నందుకు ఆగ్రహించి మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ఓజిలి మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ పిండుకూరు మౌనికా రెడ్డి భర్త పిండుకూరు మధుసూదన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా ఆదివారం మధ్యాహ్నం దాడికి…

Read more

ఓజిలి ఎస్ఐ ని కలిసిన టిడిపి యువనేత పాదర్తి

ప్రభాతదర్శిని (ఓజిలి- ప్రతినిధి): ఓజిలి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. స్వప్నని మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాదర్తి ప్రకాష్ నాయుడు మంగళవారం పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఐ కు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి, స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి…

Read more

చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు

అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో…

Read more

అడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…

అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు.…

Read more

ఓజిలి టిడిపి నాయకుడుపై ఎమ్మెల్యేకు సీనియర్ నాయకుడు ఫిర్యాదు

ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): ఓజిలి మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై అదే మండలంలో చెందిన సీనియర్ నాయకులు కలపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో వందమంది టిడిపి కార్యకర్తలు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. గ్రద్ద గుంట పంచాయతీకి చెందిన ఓ నాయకుడు పార్టీ పరపతిని అడ్డుపెట్టుకొని అవినీతి అవకతవకలకు పాల్పడుతున్నాడని ఆయన ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలలో…

Read more

వరద ప్రభావిత ప్రాంత కస్టమర్లకు బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ సత్వర సహాయం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదలు ప్రజల జీవితానికి, ఆస్తికి భారీ స్థాయిలో నష్టాన్ని కలిగించాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావితం వల్ల నష్టపోయిన తమ వినియోగదారులకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సత్వర సహాయాన్ని అందించనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ క్లిష్ట సమయాల్లో తన కస్టమర్లు తిరిగి కోలుకోవడానికి సకాలంలో, సమర్థవంతమైన క్లెయిమ్…

Read more

ప్రజలకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలి

శ్రీకాళహస్తి ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు, లాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ప్రభుత్వం వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read more

రాజీవ్ నగర్ అక్రమాలపై విచారణ నిరంతరం ప్రక్రియ…భూ బకాసురులు వదిలే ప్రసక్తి లేదు

త్వరలో మాజీ ఎమ్మెల్యే పై చర్యలు తప్పవు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టంప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీ కాళహస్తిలోని భూ అక్రమాలపై, భూ బకాసురులపై విచారణ నిరంతర ప్రక్రియ అని, రాజీవ్ నగర్ నుంచి భూ అక్రమాలపై విచారణ ప్రక్రియ మొదలు పెట్టామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

Read more

ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను బోధించాలి

ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను విద్యార్థులకు బోధించాలని ఓజిలి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజులమ్మ అన్నారు. గురువారం స్థానిక విద్య వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ విద్య అభివృద్ధి విషయంలో నిరంతర సాధనతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కేవలం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం చదువుకాదని, ఉపాధ్యాయులలో ఉన్న…

Read more

error: Content is protected !!