చైర్ పర్సన్ రేసులో 8 మంది – కౌన్సిలర్ రేసులో 84 మంది

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు గాను 92 మంది పోటీలో ఉన్నారు. ఇందులో చైర్ పర్సన్ పీఠానికి 8 మంది పోటీ పడుతుండగా, కౌన్సిలర్ పదవులకు 84 మంది బరిలో ఉన్నారు. చైర్ పర్సన్ రేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ, కాంగ్రెస్ నుండి పుట్టూరు రజియా, టీడీపీ నుండి కరేటి భారతి, బీఎస్పీ నుండి కాటమంచి ధనమ్మ, ఆప్ నుండి కోవూరు స్వప్న, ఇద్దరు ఇండిపెండెంట్లుగా మత్తి ఉషారాణి, నల్లి శ్రీలత ఉన్నారు. ఈ పదవి జనరల్ ఉమెన్ కు రిజర్వ్ కావడంతో అభ్యర్థులంతా మహిళలే ఉన్నారు. సామాజికంగా ఓసీ రెడ్డి, ఓసీ కమ్మ, ఎస్టీ యానాది, బీసీ, ఎస్సీ మాల వర్గాలకు చెందిన వారు ఉన్నారు. 32 వార్డుల్లో కౌన్సిలర్ పోటీని చూస్తే ఒక్కో వార్డులో ఇద్దరి నుండి ఐదుగురు వరకు ఉన్నారు. వార్డు 3 లో 5 మంది, వార్డు 17 లో 5 మంది, వార్డు 22 లో 5 మంది, వార్డు 14, వార్డు 30, వార్డు 31 లలో నలుగురు చొప్పున ఉండగా ఇవే అత్యంత పోటీ ఉన్న వార్డులుగా నిలిచాయి. మిగిలిన వార్డుల్లో ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నారు. పార్టీల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 32 వార్డుల్లోనూ అభ్యర్థులను నిలిపింది. టీడీపీ 26 వార్డుల్లో, బీజేపీ 4, జనసేన 2 వార్డుల్లో కూటమి అభ్యర్థులు అన్ని వార్డుల్లో ఫోటిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ 4 వార్డుల్లో, సీపీఎం 2 వార్డుల్లో, స్వతంత్రులు 19 వార్డుల్లో పోటిలో ఉన్నారు. రిజర్వేషన్ల లెక్క చూస్తే ఎస్సీలకు 6 వార్డులు, వార్డు 2, వార్డు 4 ఎస్సీ మహిళలకు, వార్డు 3, 5, 6 ఎస్సీ జనరల్ కు ఉన్నాయి. ఎస్టీలకు 2 వార్డులు – వార్డు 1 ఎస్టీ మహిళ, వార్డు 7 ఎస్టీ జనరల్ కేటాయించారు. అలాగే బీసీలకు అత్యధికంగా 12 వార్డులు – 6 బీసీ జనరల్, 6 బీసీ మహిళలకు కేటాయించారు. మిగిలిన 12 వార్డులు జనరల్ కేటగిరీ – 10 జనరల్ మహిళ, 2 అన్ రిజర్వుడ్ లుగా కేటాయించారు. మహిళా రిజర్వేషన్ విషయానికి వస్తే కేంద్రం చెబుతున్న 33 శాతం కంటే ఎక్కువగానే ఇక్కడ అమలైందని చెప్పవచ్చు. రాష్ట్రంలో 50 శాతం మహిళా రిజర్వేషన్ విధానం ఉండటంతో 32 వార్డుల్లో 21 వార్డులు మహిళలకు కేటాయించారు. అంటే 65 శాతానికి పైగా వార్డులు మహిళలకే దక్కాయి. ఇందులో జనరల్ మహిళ 10, బీసీ మహిళ 6, ఎస్సీ మహిళ 4, ఎస్టీ మహిళ 1 చొప్పున ఉన్నాయి. సామాజిక వర్గాల పరంగా చూస్తే ఎస్సీ మాల వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పేరుతో స్పష్టంగా ఉన్నారు – వార్డు 30 లో కోవూరు స్వప్న, వార్డు 31 లో కరేటి భారతి. ఎస్సీ మాదిగ అనే ప్రస్తావన అధికారులు తెలిపి వివరాలలో ఎక్కడా లేదు. మిగతా ఎస్సీ అభ్యర్థులంతా ఎస్సీ జనరల్, ఎస్సీ ఉమెన్ అని మాత్రమే ఉంది. ఆయా సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపుపై తమ తమ ధీమా వ్యక్తంచేస్తున్నారు.