ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్ట్ లకు అందరికీ ప్రభుత్వం ద్వారా ఇంటి నివేశ స్థలాలు ఇప్పించేందుకు,జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరమ్(ఏ పి జే ఎఫ్ ) కృషి చేస్తుందని ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు పీర్ల శివ రాజేష్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు టౌన్ హాల్ లో సీనియర్ జర్నలిస్ట్ ఆకుల బాబు (సింహపురి బాబు) ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మహాసభ లో ఏపిజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పీర్ల శివ రాజేష్ మాట్లాడుతూ ఏపిజేఎఫ్ అనతి కాలంలోనే జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లో అనేక విజయాలు సాధించిందన్నారు. పాత్రికేయ విలువలకు పెద్ద పీట వేస్తూ భవిష్యత్ లో జర్నలిస్ట్ ల సంక్షేమం కు అవసరమైన ఆరోగ్య, కుటుంబ భద్రత కు అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇంటి నివేశ స్థలాలు తదితర విషయాలలో జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలు నెరవేర్చి అమలు జరిగేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. నిబద్ధత, నిజాయితీతో కూడిన క్రమశిక్షణ కలిగిన నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఏపిజేఎఫ్ ను నిర్మాణాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తున్నామన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 20 సంవత్సరాల క్రితం జర్నలిజం వేరని ప్రస్తుతం ఉన్న జర్నలిజం వేరని ఆయన గుర్తు చేశారు. కొత్తగా జర్నలిజంకు వచ్చే వ్యక్తులకు ఆయా సంస్థలు విలువలు గురించి నేర్పించాలని ప్రత్యేకంగా ఆయన సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్ట్ నాయకులే సంక్షేమ నిధిని సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు తాను కూడా తన పరిధిలో సహాయపడతానని తెలిపారు. ప్రకాశం జిల్లా నాయకులు నరేష్ మాట్లాడుతూ జర్నలిజం లో చోటుచేసుకుంటున్న సాంకేతికతను ప్రతి ఒక్క జర్నలిస్టు ఉపయోగించుకోవాలని కోరారు. రానున్న రోజులలో జర్నలిస్టుల విద్యార్హతలను ప్రభుత్వం అర్హతగా తీసుకొని జర్నలిస్టు అనే గుర్తింపును ఇస్తుందని తెలిపారు. ఈ విషయంలో జర్నలిస్టులు విద్య అర్హతలు సాధించుకునేందుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఫోరమ్ సీనియర్ రాష్ట్ర నాయకులు వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఏ పి జే ఎఫ్ ఆవిర్భావంతో ప్రభుత్వానికి, జర్నలిస్ట్ లకు మధ్య సానుకూల దృక్పధం తో అనేక జీవో లను సాధించడం జరిగిందన్నారు. అక్రిడేషన్ కమిటీ లలో ప్రాతినిద్యం తో పాటు,అటాక్ కమిటీ ఏర్పాటు లో కూడా ఏపీజేఎఫ్ ముఖ్య పాత్ర కలిగి ఉండడం గర్వ కారణం అన్నారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్ట్ ల సమస్యలపై ఏ.పి.ఏం.పి.ఏ. నిరంతరం పోరాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వల్లూరు ప్రసాద్ కుమార్, వేల్పుల శేషాచలపతి, కిషన్, జయ ప్రతాప్ రెడ్డి, తిరుపతి జిల్లా నాయకులు అరవ జయపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా ఏపీజేఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక: నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శాఖమూరి శ్రీనివాసులు, ఉడతా శరత్ యాదవ్ ఏపీజేఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీ ఆహ్వానితులుగా వి.ఎస్. రామచంద్రమూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులుగా సింహపురి బాబు, గౌరవ సలహాదారులుగా నన్నూరు శ్రీనివాసరావు, జయ ప్రతాప్ రెడ్డి, అధ్యక్షులుగా శాఖమూరి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ఉడతా శరత్ యాదవ్, ఉపాధ్యక్షులుగా చేవూరు శ్రీనివాసులు, ఎస్. ప్రభావతి, పాశం సాయి రాజా లు, కార్యనిర్వాహక కార్యదర్శి కే గోపి కార్యదర్శులుగా కే. కొండయ్య, డాక్టర్ చేవూరు చిన్న, జి. హేమంత్, జెసి. శేషగిరి, అల్విన్, రమేష్, చీరల మస్తానయ్యలు సంయుక్త కార్యదర్శిగా రవీంద్ర రెడ్డి, ట్రెజరర్ గా జె. మల్లికార్జున ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాలారావు, వెంకటేశ్వర్లు, శ్రీరస్తు శ్రీనివాసులు, రమేష్ తదితరులను నూతన కమిటీ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.