తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పు
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పగడ్బందీగా నిరూపించి ముద్దాయిలకు శిక్ష పడేలా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా క్రైమ్ నెంబరు 06-2020లో కరకంబాడి బీటు, తిరుపతి రేంజి పరిధిలో పట్టుబడ్డ ప్రకాశం జిల్లాకు చెందిన చెరబోయిన వెంకటరమణ, పింజరి మహబూబ్ బాషా ఇద్దరు ముద్దాయిలు చేసిన నేరం రుజువయ్యింది. దీంతో తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహ మూర్తి ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు అభినందించారు. శేషాచలం రిజర్వు ఫారెస్టులో అత్యంత విలువైన సహజ సంపద ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేసే నేరస్తులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పని చేస్తుందని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా
Related Posts
జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు, సంక్షేమ నిధి సాధన కు కృషి చేస్తాం: ఏపీ జె ఎఫ్ జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్ట్ లకు అందరికీ ప్రభుత్వం ద్వారా ఇంటి నివేశ స్థలాలు ఇప్పించేందుకు,జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరమ్(ఏ పి జే ఎఫ్ ) కృషి చేస్తుందని ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు పీర్ల శివ రాజేష్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు టౌన్ హాల్ లో సీనియర్ జర్నలిస్ట్ ఆకుల బాబు (సింహపురి బాబు) ఆధ్వర్యంలో జరిగిన…
Read moreవిలేకరులపై కర్రతో దాడి చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ ఎలా అవుతుంది?
నాన్ కాగ్నిజబుల్ నేరం పేరుతో న్యాయమూర్తికి తప్పుడు నివేదికజర్నలిస్ట్ హైపవర్ కమిటీ జీవో 1913 అమలు ఎస్ఐ ఆదిలక్ష్మికి వర్తించదా?ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి:) పెళ్లకూరు మండలం అర్లపాడు ఎంపిపి స్కూల్లో వార్తల సేకరణకు వెళ్లిన జర్నలిస్ట్ గుంజి సుధాకర్ పై జరిగిన దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులను కాపాడేందుకు పెళ్లకూరు ఎస్ఐ దారం ఆదిలక్ష్మి జర్నలిస్టులకే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారని ఆరోపణలు…
Read more