*ఫోర్త్ ఎస్టేట్ ముందున్న మూడు ఎస్టేట్స్ ఏవి… అనే విషయాన్ని తెలుసుకుందాం.. మానవ మనుగడకు, ప్రగతికి ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్తంభాలుగా ఉన్న వ్యవస్థల్లో జర్నలిజం (ఫోర్త్ ఎస్టేట్) అనేది ప్రధాన మైనది. మరి ఈ ఫోర్త్ ఎస్టేట్ (జర్నలిజం) కన్నా ముందున్న ఆ మూడు స్తంభాలు అనేది మనలో చాలా మందికి తెలియదు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఈ నాలుగు స్తంభాలు ఎంతో అవసరం. (1)శాసన రంగం.(Legislature), (2)పాలనా రంగం (Executive, (3)న్యాయశాఖ (Judiciary, (4) పత్రిక రంగం- వర్కింగ్ జర్నలిస్టు (Journalism work) ఈ నాలుగు ఎస్టేట్స్ మనదేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్థంభాలుగా ఉన్నాయి. వాటి వివరణ కూడా క్లుప్తంగా తెలుసు కుందాం. (1)శాసన రంగం*: ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉంటుంది.ఎన్ని కైన రాష్ట్ర ఎమ్మెల్యేలు, అలాగే శాసనమండలి సభ్యులు లేదా? మహిళలు ఇలా ప్రజా ప్రతి నిధులతో రూపొందించబడింది. ఇది ఫస్ట్ ఎస్టేట్ గా ఉంది.*(2)పాలనా రంగం*:ఎగ్జిక్యూటివ్ అనేది అధికార ప్రభుత్వంలో నిర్వాహక లేదా పర్యవేక్షక అధికారం కలిగి ఉన్న వ్యక్తి లేదా ?కొద్దిమంది వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. కార్యనిర్వాహకుడు సీఎం ప్రభు త్వపరంగా చట్టాన్ని,(జి.ఓ) లు అమలు చేయడానికి మరియు అమలు పరచడానికి బాధ్యత వహిస్తాడు. దీనినే సెకండ్ ఎస్టేట్ గా పిలుస్తారు.*(3)న్యాయశాఖ*: దేశంలో పలు రాష్ట్రాలుగా ఉన్న అక్కడి ప్రభుత్వాల పరిధిలో ఉన్న ప్రభుత్వ మొత్తం భాగం ఆ పరిధిలో న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది. దాని న్యాయ స్థానాలలో న్యాయమూర్తు లందరినీ కలిగి ఉంటుంది. దీనినే థర్డ్ ఎస్టేట్ అని అంటారు. *(4)వర్కింగ్ జర్నలిస్ట్*: జర్నలిజం అనగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సత్వర సందేశాలు,ఫోటోలు, వీడియోల రూపంలో సేకరించి ఆ సమాచారాన్ని పత్రిక, లేదా టివీల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమాచారాన్ని విస్తృతపరిచే విధానాన్ని జర్నలిజం అంటారు. దీనినే ఫోర్త్ ఎస్టేట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులను కూడా జర్నలిజం రంగంలో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న వారిని మాత్రమే ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధిగా గుర్తిస్తారు. దేశంలో ఉన్న అన్ని రంగాలలో జర్నలిజం ఎందుకు ఫోర్త్ ఎస్టేట్ అయ్యింది అంటే దీనికి ప్రతినిధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఒక ప్రత్యేక మైన గుర్తింపు కలిగి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల అవసరాలను,ప్రభుత్వ విధానాలకు అనుసం ధానం చేసే వారధిగా జర్నలిస్టులను ప్రభుత్వం రెండున్నర శతాబ్దాల క్రితమే గుర్తించింది. ఇంతటి గౌరవ ప్రదమైన హోదాతో ఎంతోమంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతున్న రంగం జర్నలిజం.
జర్నలిజం -జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్ ఎలా అయ్యారు?
Related Posts
బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ – దేశవ్యాప్తంగా చర్చ
న్యూఢిల్లీ, (ప్రభాతదర్శిని ప్రతినిధి): బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఇద్దరు దోషుల జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. వారు 17 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నారని, అందులో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉందని ధర్మాసనం పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానోపై…
Read moreజాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టం కావాలి
మహిళల భాగస్వామ్యమే నిజమైన అభివృద్ధిముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడుప్రభాతదర్శిని, విశాఖపట్నం – ప్రతినిధి): వేగవంతమైన అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ఘనంగా ముగిసింది. రెండు రోజుల్లో మొత్తం 100 ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.7,25,940 కోట్ల పెట్టుబడి…
Read more