ప్రభాతదర్శిని (తిరుపతి – ప్రతినిధి): పెళ్లకూరు మండలం శిరసనం బేడు ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేలూరు మోహన రూప రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వేలూరు మోహన రూప రెడ్డి మాట్లాడుతూ శిరసనంబేడు సెగ్మెంట్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. .1982 నుండి నేటి వరకు తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుందని అన్నారు. తన మామ, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వేలూరు మురళీకృష్ణారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు శిరసనంబేడు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలియజేశారు. శిరసనంబేడు సెగ్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదించి, గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం,ప్రముఖ పారిశ్రామిక వేత్త కొండేపాటి గంగా ప్రసాద్ సహకారంతో తాను తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలియజేశారు