ప్రభాతదర్శిని (ప్రత్యేక -ప్రతినిధి): 2024 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషనర్లు ఫేజ్-2 శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సబ్-డివిజన్లలో సబ్-కలెక్టర్లుగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా సందీప్ రఘు వంశీ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా కనాల చిరంజీవి నాగ వెంకట సాహిత్ నియమితులయ్యారు. పోలవరం జిల్లా రంపచోడవరం సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా దొనక పృథ్వీరాజ్ కుమార్, చింతూరు సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా చిట్టపులి నరేంద్ర పాదల్ నియమితులయ్యారు. చింతూరు బాధ్యతల్లో ఉన్న శుభం నోఖ్వాల్‌ను పూర్తి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా సచిన్ రహర్, అనంతపురం జిల్లా పెనుకొండ సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా ఫరీన్ జాహీద్, నంద్యాల జిల్లా నంద్యాల సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా మనీషా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శుభం నోఖ్వాల్ బదిలీపై తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా నియమితులయ్యారు. సంబంధిత సబ్-డివిజన్లలోని డిప్యూటీ కలెక్టర్లు / రెవెన్యూ డివిజనల్ అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.