సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తిరుపతి నగరంలోని స్థానిక భవాని నగర్ లో ఉన్న రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ పలమనేరు మండలం జీడిమకుల పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో తొమ్మిది రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిషన్ అయినప్పటికీ 3 లక్ష రూపాయలు యాజమాన్యం వసూలు చేయడం జరిగిందని వివరించారు. చివరకు ఠాగూర్ తరహా వైద్యం అందించి తల్లిపుస్తుల తాకట్టు పెట్టి హాస్పిటల్లో ఫీజు చెల్లించిన కుటుంబ సభ్యులు మరణించినప్పటికీ ఏమాత్రం మానవత్వం చెప్పుకుంటా 45 వేల రూపాయలు చెల్లించాలని మంగళవారం ఉదయం నుంచి మృతదేహాన్ని అంటిపెట్టుకొని దందా నడిపిన ఆసుపత్రి యాజమాన్యం ఏ మాత్రం మానవత్వం లేకపోవడంతో పాటు సంబంధిత ఎమ్మెల్యే ఫోన్ చేసిన స్పందించకుండా నిర్లక్ష్యంగా మాట్లాడి డబ్బులు వసూలు చేసిన హాస్పిటల్ పై హాస్పిటల్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వెంటనే విచారణ చేపట్టి హాస్పిటల్ పై విచారణ చేపట్టి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పేదల రక్తాన్ని జలగల్లాగా రక్తం తాగుతున్న రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని సిపిఐ గా డిమాండ్ చేస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. హాస్పిటల్ పై చర్యలు తీసుకొని పక్షంలో తాము ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దానికి తోడు జిల్లా వైద్యానికి శాఖ అధికారులు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పై నిర్లక్ష్యం వహించడం బాధ్యత రహితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చెప్పటాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
