
అఖిలేష్ యాదవ్ మాటలు అర్థరహితం
బిజెపి రాష్ట్ర నేత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి

ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించిందని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరని అన్నారు. పార్లమెంట్లో సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బిజెపి పై చేసిన విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీలో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు నాయకులు ఎన్నుకోవాలంటే ప్రజాస్వామ్య బద్దంగా సామాన్య కార్యకర్త నుండి అత్యున్నత స్థాయి వరకు ఉన్న వారి అభిప్రాయ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం జరుగుతుంది అని అన్నారు. సమాజ్ వాజ్ పార్టీ నుండి ఎవరినైనా ఎన్నుకోవాలంటే వారి కుటుంబంలోనే నలుగురు సభ్యులు కూర్చుంటే వారే నాయకులు అవుతారని ఆయన ఎద్దేవా చేశారు. అఖిలేష్ యాదవ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం బిజెపికి లేదన్నారు. భారతీయ జనతా పార్టీ ఓజిలి మండలంలో సంస్థాగతంగా బలంగా ఉందని అన్నారు. గతంలో మండలంలో జడ్పిటిసిని గెలుచుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఓజిలి మండలం బిజెపి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బిల్లు పవన్ కుమార్ ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. రానున్న రోజులలో ఓజిలి మండలంలో బిజెపి మరింత బలపడే విధంగా కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు కొండూరు రవీందర్ రాజు, మనోహర్, ఆరుముళ్ళ వరప్రసాద్, కొక్కు శేషయ్య యాదవ్, గోపాల్, శోభన్, కోటి, భాను, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.