ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో సన్ సైడ్ దుర్మరణం చెందిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు పట్టణలోని కేఎన్ఆర్ పాఠశాలలో సన్షెడ్ కూలి తొమ్మిదో తరగతి చదివే గురు మహేంద్ర(15) అనే విద్యార్థి మృతి చెందారు. నాడు నేడు కింద చేస్తున్న పనులు అసంపూర్ణంగా ఉండడం, ఆ ప్రాంతంలో తరగతులు నిర్వహించడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అధికారులు గంటల వ్యవధిలో అప్రమత్తమైన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. విద్యార్థి తల్లిదండ్రులకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు గ్రామీణ టిడిపి గిరిధర్ రెడ్డి, జనసేన నాయకులు కిషోర్, అధికారులు సంతాపం తెలిపి సానుభూతిని వ్యక్తం చేశారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.
భద్రతా వైఫల్యమే శ్రీకాళహస్తి ఆలయంలో అగ్ని ప్రమాదం:అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆనం ఆగ్రహం
ప్రభాతదర్శిని, శ్రీకాళహస్తి-ప్రతినిధి: శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అదనపు లడ్డూ పోటులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం మంత్రి ఆనం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం…
పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మోహన్ రెడ్డి వ్యాఖ్యలు
ప్రభాతదర్శిని, నాయుడుపేట-ప్రతినిధి: మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అపారమైన అనుభవం సంపాదించిన తంబిరెడ్డి మోహన్ రెడ్డి, తన మాతృమూర్తి నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఊహించని విధంగా రావడంతో రాత్రింబవళ్లు కష్టించి తన మాతృమూర్తి తంబిరెడ్డి రాజేశ్వరమ్మను చైర్ పర్సన్ చేసుకోగలిగారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజకీయ విభేదాలు, పొరపొచ్చులు చోటు చేసుకోవడం ఉంటుంది. ఈ క్రమంలో ఏదో…