ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో సన్ సైడ్ దుర్మరణం చెందిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు పట్టణలోని కేఎన్ఆర్ పాఠశాలలో సన్షెడ్ కూలి తొమ్మిదో తరగతి చదివే గురు మహేంద్ర(15) అనే విద్యార్థి మృతి చెందారు. నాడు నేడు కింద చేస్తున్న పనులు అసంపూర్ణంగా ఉండడం, ఆ ప్రాంతంలో తరగతులు నిర్వహించడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అధికారులు గంటల వ్యవధిలో అప్రమత్తమైన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. విద్యార్థి తల్లిదండ్రులకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు గ్రామీణ టిడిపి గిరిధర్ రెడ్డి, జనసేన నాయకులు కిషోర్, అధికారులు సంతాపం తెలిపి సానుభూతిని వ్యక్తం చేశారు.
నెల్లూరు కేఎన్ఆర్ స్కూల్ లో సన్ సైడ్ కూలి విద్యార్థి దుర్మరణం
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more