ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రత్యేక ప్రతినిధి) తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అపచారం జరిగింది.ఈసారి ఏకంగా పాదరక్షలు వేసుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంతమంది భక్తులు రావడం జరిగింది.కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక ప్రచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.లిక్కర్ అలాగే పాన్ పరాక్ గుట్కాలు ఇలా రకరకాల నిషేధిత పదార్థాలను పట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంత మంది భక్తులు వెళ్లడం జరిగింది.వాళ్లందరినీ గతంలో పోలీసులు పట్టుకోగా తాజాగా చెప్పులు వేసుకుని కొంత మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే తిరుమల శ్రీవారి ముఖద్వారం దగ్గరికి వెళ్లగానే పాదరక్షలతో బయలుదేరిన వారిని అధికారులు అడ్డుకున్నారు.వస్తావంగా తిరుమల శ్రీవారి దర్శనం నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు.కానీ ఆ మూడు స్థానాల్లో కూడా టిటిడి అధికారులు చెప్పుల విషయాని గుర్తించలేదు.తిరుమల ముఖద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత అధికారులు గుర్తించారు.ఇక అధికారుల నిర్లక్ష్యంపై టిటిడి పాలకమండలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది.దీనిపై ప్రత్యేక విచారణ జరపాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.