యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు
ప్రభాతదర్శిని, (యర్రగొండపాలెం-ప్రతినిధి):కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి చెడుగా మాట్లాడరని, నోరు ఉందికదా అని ఎలా పడితే ఆలా మాట్లాడితే ఊరుకోబోం – నోరుజారితే చట్టపరమైన చర్యలు తప్పవని యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హెచ్చరించారు. మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్న క్యాంటీన్ల పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపి, చంద్రశేఖర్ తీరుపై ధ్వజమెత్తారు. అన్నా క్యాంటీన్ లో అన్నం తినే పేదలను బిచ్చగాళ్ళతో పోల్చడం తాటిపర్తి చంద్రశేఖర్ కు సిగ్గుచేటు అనిపించలేదా అని ప్రశ్నించారు. అన్నం తినే ఎవరూ అన్నా క్యాంటీన్ గురించి హేళనగా మాట్లాడరని మరి చంద్రశేఖర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పేద ప్రజలకు క్షమాపణలు కోరాలని హెచ్చరించారు. గతంలో కూడా నోరు ఉంది కదా అని మీడియా సమావేశాలలో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా చంద్రశేఖర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరబ్రహ్మ స్వరూమైన అన్నం పై మాట్లాడిన ఎవరు బాగుపడిన చరిత్ర లేదని తెలిపారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. లేకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ది చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.