ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.