ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
వినుత దంపతులను చంపాలని ఎమ్మెల్యే ఆదేశాలు
శ్రీకాళహస్తి సోషల్ మీడియాలో వీడియో హల్ చల్…రెండుసార్లు ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించావినుత రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేశా…తనకు ఎమ్మెల్యే ఇరవై లక్షలు ఇచ్చారని వెల్లడిసెల్ఫ్ వీడియోలో రాయుడు సంచలన విషయాలు…కూటమినేతుల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలుప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): శ్రీకాళహస్తిలో గత రెండు నెలలు క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇంచార్జి కోటా వినుత వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య…
Read moreవి.ఎస్.యూ విద్యార్థి ఎం. పృథ్విరాజ్‌కు రాష్ట్రపతి చేతుల ఉత్తమ అవార్డు
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ), నెల్లూరు బయోటెక్నాలజీ విభాగానికి చెందిన యన్ ఎస్ ఎస్ వాలంటీర్ ఎం. పృథ్విరాజ్ సామాజిక సేవలో చేసిన విశిష్ట కృషికి గాను యన్ ఎస్ ఎస్ జాతీయ ఉత్తమ వాలంటీర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు ప్రదానం చేశారు. ఈ వేడుకలో కేంద్ర యువజన…
Read more