ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
‘పేటలో సిండికేట్ జోరు …మందు’ బాబుల బేజారు…లిక్కర్ పై ధరల బాదుడు
నిబంధనలను పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..!ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట ఎక్సైజ్ పరిధిలో సిండికేట్ జోరుతో మద్యం ప్రియులు బేజారుకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ లిక్కర్ సిండికేట్ మాయాజాలంతో మద్యం ప్రియులను యధేచ్చగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయవలసిన ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు మౌనవ్రతం చేయడం విశేషం.అధికార పార్టీ చెడ్డ పేరు చేస్తున్న వైనం: త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల…
Read moreఅభివృద్ధి లోటుపాట్లను గుర్తించి 50–60 కీలక ప్రాజెక్టుల రూపకల్పనకు చర్యలు:తిరుపతి ఎకనామిక్ రీజియన్ సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా
తిరుపతి ఆర్థిక ప్రాంత ప్రణాళిక–2047 పై ప్రణాళికను రూపొందించడమే సమగ్రంగా అభివృద్ధి ప్రధాన ఉద్దేశ్యంప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధనలో భాగంగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) ప్రణాళిక–2047 రూపకల్పనకు క్షేత్రస్థాయి భాగస్వాముల సూచనలు, సలహాలు ఎంతో కీలకమని తిరుపతి ఎకనామిక్ రీజియన్ సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు…
Read more