ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 88 కళాశాలల విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 48మంది పరిశీలకులను, రెండు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.యూజి రెండో సెమిస్టర్ పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు,చీఫ్ సూపరింటెండెంట్లు,యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సహకరించాలని డాక్టర్ పద్మజ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
Related Posts
ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా మారాలి: రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ డాక్టర్ సుజాతా రావు
ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే రాజకీయ పార్టీలకి ఓటు వేయవద్దు:డాక్టర్ పివి రమేష్ పిలుపు ఆరోగ్యం సామాజిక బాధ్యత’ తిరుపతి సదస్సులో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ లుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): దేశంలో ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కుగా మారాలని, భారత ప్రభుత్వ పూర్వ ఆరోగ్య కార్యదర్శి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. సుజాతారావు అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వేమన విజ్ఞాన కేంద్రం,…
Read moreభారత్ టెక్స్ 2024లో పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ పెవిలియన్
పెట్టుబడిదారులతో చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి కీలక చర్చలు ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ-ప్రతినిధి): న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ 2024 లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధులు పలు పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరిపారు. రాష్ట్రం అందించే పెట్టుబడి అనుకూల వాతావరణం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు,…
Read more