యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలిప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైన జిల్లా అని జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్ వెంకటేశ్వర్ పరిశ్రమల శాఖ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైనదని అన్నారు. ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను సకాలంలో అందజేస్తూ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటునిస్తూ యువతకు ఉపాధి కల్పించే దిశలో అనేక చర్యలు చేపడుతోందని, గౌ. ముఖ్యమంత్రి వర్యులు నూతన పరిశ్రమల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి ద్వారా చేపట్టిన కార్యక్రమాల వివరాలను, వారి విధులను అధికారులు కలెక్టర్ కు వివరించగా కలెక్టర్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (విసిఐసి) శ్రీకాళహస్తి నోడ్, చెన్నై బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ -కృష్ణ పట్నం నోడ్ (సిబిఐసి- క్రిస్ సిటి), స్పెషల్ ఎకనామిక్ జోన్ లైన శ్రీ సిటీ, మేనకూరు, తడ ఎస్ఈజడ్ ల ప్రస్తుత స్థితి గతులపై సమీక్షించారు. ఇనగలూరు హిల్ టాప్ సెజ్,ఈఎంసి 1&2, పాగాలి ఇండస్ట్రియల్ పార్క్, చంద్రగిరి నందు ఏర్పాటు చేయబోతున్న ఐటి పార్క్, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులు ప్రణాళికా బద్ధంగా పురోగతి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జడ్ఎం చంద్ర శేఖర్, డిప్యూటీ జడ్ఎం లు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులు, తదితర సంబంధిత అధికారులు హాజరయ్యారు.
నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలం: జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్ వెంకటేశ్వర్
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreసీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…
Read more