ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
బ్రహ్మోత్సవాలకు యాడ్స్ నిర్ణయించేది ప్రెస్‌క్లబ్ సభ్యులా?
మీడియా ముసుగులో కమీషన్లకు కక్కుర్తిపడి సిఫారసులు చేసిన దళారులుఈవో గారు… పిఆరఓ ఎందుకు ఉన్నట్లు ?వార్తలు కవర్ చేసే రిపోర్టర్ల ఎవరో తెలుసుకోలేని దుస్థితిలో ఈవో ఉన్నారా?(నన్నూరు.శ్రీనివాసరావు, ఎడిటర్, ప్రభాతదర్శిని): శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో కొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు పబ్లిసిటీ కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు (యాడ్స్) జారీ చేసే విషయంలో స్థానికంగా ఉన్న ప్రెస్ కమిటీ…
Read moreశ్రీకాళహస్తీశ్వరా బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో…‘రెగ్యులర్టీ నిబంధనలకు పంగనామాలు’
పరపతి ఉన్నవారికే శ్రీకాళహస్తీశ్వరా స్వామి యాడ్లు?అర్హతలేని మీడియా సంస్థలకు యాడ్స్ ఇవ్వాలని పాలక మండలి సభ్యులు చెప్పారా?సొంత సొమ్ములా స్వామి సొమ్మును దోచి పెడుతున్నకార్యానిర్వాహణాధికారి బాపిరెడ్డిప్రశ్నిస్తే పొంతనలేని విచిత్ర,వింత సమాధానాలునన్నూరు శ్రీనివాసరావు,(ప్రభాతదర్శిని, సంపాదకులు): దక్షిణ కాశీ గా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల మీడియా ప్రకటనల జారీలో ఆలయ కార్యనిర్వహణా ధికారి బాపిరెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పంగనామాలు పెడుతున్నారు. స్వామివారి సొమ్మును సొంత సొమ్ముగా…
Read more