ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
తెలుగు సబ్జెక్టు మీద ఉన్న ప్రేమ.. కెమిస్ట్రీ సబ్జెక్టుపైన ఎందుకు లేదు?
ఎవరి ప్రయోజనాల కోసం లేని పోస్టును సృష్టించారు?నెల్లూరు కే ఎ సి ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు పంగనామాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) : నెల్లూరు కేఏసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వనిబంధనలకు పంగనామాలు పెట్టారు. కే ఏ సి కళాశాలలో తెలుగు సబ్జెక్టుకు రెండు పోస్ట్ ఉండగా లేని మరో పోస్టుకు నియమాకం చేసి నిబంధనలను ఉల్లంఘించారు. తెలుగు సబ్జెక్టుకు ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్స్‌ను నియమించి కొత్త వివాదానికి తెర…
Read moreఅభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం
సుపరిపాలనకు తొలి అడుగులో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. బుధవారం ఓజిలి మండలం కురుగొండ, మానమాల గ్రామాలలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత వైసిపి పాలనలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల బారిన పడవేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక లోటును అధిగమిస్తూ…
Read more