👉🏻అంచనాలకు అందని ఓటరు నాడి… గెలుపు విజేత పై తగ్గని రాజకీయవేడి

👉🏻చైతన్యం చూపిన గూడూరు గ్రామీణ ఓటర్లు

👉🏻పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

👉🏻గూడూరు ఎంఎల్ఏ విజేతపై నెలకొన్న ఉత్కంఠప్రభాతదర్శిని,

(గూడూరు -ప్రతినిధి): లక్కు ఎవరిదంటే… లెక్కలేసుకుంటున్నారు గూడూరు రాజకీయ నేతలు. ఎన్నికల సమరంలో ఎవరి తలరాతలు మారుతాయో అని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం సైలెంట్ ఓటర్లు ఎవరిని దెబ్బతీస్తారన్న చర్చ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.ఎన్నికలు ముగిశాయి. గూడూరు లో అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ పోలింగ్ జరగడంతో భారీగా పోలింగ్ నమోదయినట్లు తెలిసింది.ఎన్నికలు ముగిసినా.. ఎవరికి అధికారం అన్నది మాత్రం అంతుచిక్కకుండా ఉంది.అన్ని సభలకు జనం విపరీతంగా వస్తున్నారు. అంటే.. స్వచ్ఛందంగా వచ్చారా? లేక డబ్బులు, బిర్యానీ, మందు బాటిల్ ఇచ్చి తీసుకు వచ్చారా? అన్నది పక్కన పెడితే జనం మాత్రం నిండుగా అన్ని సభల్లో కనపడుతున్నారు. ముందుగానే అభ్యర్థులను అన్ని పార్టీలూ ప్రకటించడంతో క్యాండిడేట్ అనుచరులు సభ ముందు భాగాన ఉండి జేజేలు పలుకుతున్నారు. ఇది పత్రికలో ,టీవీల్లో కనిపించి బలం అనుకుంటే పొరపాటుపడినట్లే. అసలు ఓటర్లు అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్లే సైలెంట్ ఓటర్లు. ఇప్పటి వరకూ సర్వేలకు కూడా గూడూరు నియోజకవర్గం జనం నాడి అందలేదు. సర్వే ఫలితాలు కూడా అంత యాక్యురేట్ గా వస్తాయని కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు జనం క్యూ కట్టారు. గతంలో ఏఎన్నికల్లో చూడని విధంగా అర్థరాత్రి దాటేంత వరకూ పోలింగ్ జరిగింది. ఇది ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది.చివరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లు కూడా ఆ బూత్ లో తమ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇందుకు కారణం ఓటర్లందరూ గుంభనంగా ఉండటమే. ఏ నేత వచ్చినా నవ్వుతో పలుకరిస్తుండటం కూడా అంచనాలకు అందడం లేదు.వైసీపీ ధీమాగా…అయితే ఎవరికి వారే తమ పార్టీదే అధికారం అన్న ధీమాలో ఉన్నారు. పోలింగ్ కు వచ్చిన వారిలో అధిక శాతం మంది తమకే ఓటు వేసి ఉంటారని భావించి ఇటు అధికార వైసీపీ కానీ, అటు ప్రతిపక్ష కూటమి నేతలు కూడా ధీమాగానే కనిపిస్తున్నారు. ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగే సమయంలో జనం మూడ్ ను బట్టి ఒక అంచనాకు ఈసారి రాలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. ప్రభుత్వంపై ఆగ్రహం ఉంటే ఆ స్థాయిలో అర్ధరాత్రి వరకూ వేచి ఉండి ఓటు వేసేవారా? అని అధికార పార్టీ ప్రశ్నిస్తుంది. ఇది పాజిటివ్ ఓటుగానే తాము భావిస్తామని వైసీపీ ఫంఖా భజాయించి చెబుతుంది.-టీడీపీ వాదన ఇలా…కానీ ఈ ప్రభుత్వం పోతేనే తమ బతులకులు మారతాయని భావించి ఓటర్లు కసితో ఉన్నారని, అందుకే ఎంత సమయమైనా వేచి ఉండి మరీ ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకుని క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచున్నారన్నది కూటమి నేతల వాదన. ప్రాంతాల వారీగా చూసుకుంటే ఈసారి గూడూరు నియోజకవర్గం లో అత్యధిక స్థానాలను సాధించి తీరుతామని చెబుతున్నారు. అందుకే తమలో అంత కాన్ఫిడెన్స్ ఉందని అంటున్నారు.-విశ్లేషకులు మాత్రం…అయితే విశ్లేషకులకు కూడా ప్రజల నాడి అందడం లేదు. మహిళలు, వృద్ధులు, యువత అధిక సంఖ్యలో రావడంతో కొంత అటుఇటుగానే ఫలితాలు ఉంటాయని అంచనాలు వినపడుతున్నాయి. ఎవరు గెలిచినా మ్యాజిక్ ఫిగర్ కు బోర్డర్ లోనే ఉంటారన్నది ఎక్కువ మంది విశ్లేషకుల అంచనా. గత ఎన్నికల్లో మాదిరి వన్ సైడ్ ఎన్నికలు మాత్రం ఈసారి జరగలేదన్నది అందరూ అంగీకరించే వాస్తవం. మహిళలు ఎవరివైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. అందుకే మహిళ ఓటర్లు సంక్షేమ పథకాలకు ప్రభావితులయి ఓటు వేశారా? లేదా మార్పుకోసం కొంగు బిగించారా? అన్నది మాత్రం అర్థం కాకుండా ఉంటుందన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ తో పాటు సోషల్ ఇంజినీరింగ్ కూడా బాగా పనిచేసే ఛాన్స్ ఉందన్నది ఎక్కువ మంది విశ్లేషకులు అందిస్తున్న అభిప్రాయంగా ఉంది. మరి విజేత ఎవరో? వీరతిలకం దిద్దుంచుకున్నేది ఎవరో జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.