– జలాశయ అభివృద్ధే లక్ష్యంగా పర్యటన
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల జలాశయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ ఆహ్వానం మేరకు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమశిల సందర్శనకు విచ్చేయనున్నారు. ఆదివారం ఉదయం సోమశిల జలాశయాన్ని రాష్ట్ర దేవాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించనున్నారు. అనంతరం సోమేశ్వరాలయం, కండలేరు రిజర్వాయరును మంత్రులు పరిశీలించనున్నారు. సోమశిల, కండలేరు జలాశయాల అభివృద్ధి, పురాతన సోమేశ్వరాలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను మంత్రులు ఆనం, నారాయణ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడి దృష్టికి తీసుకెళ్లి ప్రాథమికంగా చేపట్టాల్సిన పనులను మంత్రికి వివరించనున్నారు. అనంతరం కండలేరు జలాశాయ అతిథి భవనంలో మంత్రులు జలవనరులశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా సోమశిల ఆఫ్రాన్, రక్షణ గోడ నిర్మాణ పనులు, గేట్ల మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసేలా మంత్రులు జలవనరులశాఖ మంత్రికి వివరించనున్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.