*ఎమ్మెల్యే* పులివర్తి నాని
ప్రభాతదర్శిని, (తిరుచానూరు -ప్రతినిధి): చంద్రగిరిలో టిడిపి గెలుపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు  కానుకగా ఇస్తున్నట్లు ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. బుధవారం ఆయన తిరుచానూరు లోనే పద్మావతి అమ్మవారిని  కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టిడిపి జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి సీటును టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. 2024 సార్వత్రిక  ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం భారీ మెజారిటీతో చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి 
దర్శనానంతరం వేద ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో పులివర్తి నాని కుటుంబాన్ని ఆశీర్వదించారు. అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యేగా గెలవడానికి  ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు శ్రీ పద్మావతి అమ్మవారికి 501 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.