ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభంలో మంత్రి నారా లోకేష్
విద్య–పరిశ్రమల అనుసంధానంతో వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్
దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుందన్న మంత్రి
ప్రభాతదర్శిని (శ్రీసిటీ ప్రత్యేక-ప్రతినిధి):వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ కు శ్రీసిటీలో ఎస్ఐయూ అమలు చేస్తున్న బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ,ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ (ఎస్ఐయు)ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మన యువతకు అపారమైన సామర్థ్యం, ఆశయాలు ఉన్నాయని, వారికి అవసరమైనదల్లా ఉపాధి అవకాశాలతో నేరుగా అనుసంధానమైన విద్యావిధానం అన్నారు. ఈ కీలక సవాలుకు పరిష్కారం చూపే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. ఎస్ఐయూ అమలు చేస్తున్న వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ కు శ్రీసిటీలోని బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోందన్నారు. 31 దేశాలకు చెందిన 250కుపైగా కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశ్రమ, విద్యావ్యవస్థలను ఇంత సమగ్రంగా అనుసంధానించిన కేంద్రాలు దేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదు అని వ్యాఖ్యానించారు. ఎస్‌ఐయూలో విద్యార్థులు తాము విద్యను అభ్యసించే క్యాంపస్‌కు సమీపంలోనే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో కలిసి నేర్చుకునే, పనిచేసే అవకాశాన్ని పొందనున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్ల డిగ్రీ చదివిన విద్యార్థి, మొదటి సంవత్సరం నుండే వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌ల ద్వారా సంపాదించిన 2 సంవత్సరాలకు పైగా నిజమైన పరిశ్రమ అనుభవాన్ని సంపాదించి పట్టభద్రుడిగా బయటకు వస్తారని శ్రీసిటీఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఎస్ఐయు పాలకమండలి ఛైర్మన్ శ్రీనిరాజు పేర్కొన్నారు. దీనికితోడు, పరిశ్రమతో కలిసి రూపొందించిన పాఠ్యప్రణాళిక, విద్యార్థులకు అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు.
వినూత్నవర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ విద్యావిధానానికి ఎస్ఐయూ మార్గదర్శకత్వం: భారతదేశంలో ప్రతివిద్యార్థి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతో పట్టభద్రుడై ఉపాధి అవకాశాలను పొందేలా రూపొందించిన వినూత్నవర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ విద్యావిధానానికి ఎస్ఐయూ మార్గదర్శకత్వం వహిస్తోంది. భారత ఉన్నతవిద్య కీలక మలుపులో ఉన్న సమయంలో ఈ వినూత్నప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ప్రతి సంవత్సరం 90 లక్షలకు పైగా విద్యార్థులు పట్టభద్రులవుతున్నప్పటికీ, వారిలో కేవలం 42.6 శాతం మంది మాత్రమే ఉపాధికి తగిన నైపుణ్యాలను కలిగి ఉన్నట్లు అంచనా. ఉద్యోగాలు పొందిన వారిలో సగానికిపైగా తమ అర్హతలకు తగని ఉద్యోగాల్లో పనిచేస్తుండగా, 80 శాతానికి పైగా సంస్థలు తగిన నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నట్లు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితిని భారత్ ఎంప్లాయబిలిటీ అండ్ జాబ్స్ ఛాలెంజ్ గా అభివర్ణిస్తున్న ఎస్ఐయూ, ఈ సవాలుకు ఆచరణాత్మక పరిష్కారాన్నిఅందించాలనే లక్ష్యంతో ఈ మోడల్‌ను రూపొందించింది. ఎస్ఐయూ అమలుచేస్తున్నవర్క్-స్టడీ డ్యూయల్మోడల్లో విద్యార్థులు తమ సమయాన్నిమూడింట ఒకవంతు క్యాంపస్‌లో అకడమిక్ విద్యా అభ్యసించేందుకు, మిగిలిన సమయాన్ని పరిశ్రమ భాగస్వామ్య సంస్థల్లో ఇంటర్న్‌లుగా పనిచేసేందుకు కేటాయిస్తారు. పరిశ్రమ భాగస్వామ్య సంస్థల్లో ఇంటర్న్‌షిప్ ని నిర్వహిస్తున్న విద్యార్థులకు తొలి సంవత్సరం నుంచే నెలకు కనీసం రూ.10,000 స్టైఫండ్ అందజేస్తారు. విద్యార్థుల నైపుణ్యాలు, ఉత్పాదకత పెరుగుతున్నకొద్దీ స్టైఫండ్ మొత్తాని మరింత పెంచాలని పరిశ్రమ భాగస్వాములు భావిస్తున్నారు. దీంతో ఎస్‌ఐయూలో నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసే విద్యార్థులు సుమారు రెండేళ్లకుపైగా వాస్తవ పరిశ్రమ అనుభవంతో పట్టభద్రులుగా బయటకు వస్తారు. విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను సొంతం చేసుకునేలా పాఠ్య ప్రణాళికను పరిశ్రమ భాగస్వాములతో కలిసి రూపొందించారు. కృత్రిమమేధస్సు (ఏఐ) ఆధారిత పారిశ్రామికరంగంలో వేగంగా చోటుచేసుకుంటున్నమార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలను ప్రతి సంవత్సరం నవీకరిస్తూ, భవిష్యత్ ఉద్యోగానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలను విద్యార్థులు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవస్థాపకతను ప్రోత్సహించేదిశగా ఎస్ఐయూ తన క్యాంపస్‌లో ‘స్టేషన్-ఎస్’ పేరుతో ఇంక్యుబేషన్సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. క్యాట్-ఐ వెంచర్ క్యాపిటల్ అయిన స్టేషన్-ఎస్&జ్ఞానం సర్కిల్ వెంచర్స్ సహకారంతో సుమారు 10 స్టార్టప్‌లు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ ఏడాది నాలుగు కోర్సులలో అడ్మిషన్లు.. ఎస్అయు 2026–27 విద్యాసంవత్సరానికి నాలుగు అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాలను అందిస్తోంది. బి టెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (స్కూల్ ఆఫ్ టెక్నాలజీ & ఏఐ), బి టెక్ ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ (స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్), ఫైనాన్స్ & అకౌంట్స్, డిజిటల్ మీడియా & కమ్యూనికేషన్స్‌లో బి.బి.ఏ కోర్సులతో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు www.thesiu.org ద్వారా ఆన్‌లైన్‌లోదరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకోసం: +91 8977763331 / +91 8977763332. ఈమెయిల్: admissions@thesiu.org ను సంప్రదించవచ్చు. అని తెలిపారు. అంతక ముందు ఈ కార్యక్రమంలో ఎస్ ఐయు గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, పాలకమండలి ప్రతినిధులు, పరిశ్రమ భాగస్వాములు పాల్గొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మంత్రి, అతిధులకు సాదర స్వాగతం పలికారు.
శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో లోకేష్ సందడి: వివిధ సందర్భాల్లో ఇప్పటి వరకు నాలుగుసార్లు శ్రీసిటీ లో పర్యటించిన మంత్రి లోకేష్, మొట్టమొదటి సారి శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో అడుగుపెట్టారు. ఈ సమయంలో ఇక్కడ ఏర్పాటు శ్రీసిటీ మోడల్, వివిధ పరిశ్రమల ఉత్పత్తుల నమూనాలు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల సందర్శనల చిత్ర మాలికలతో పాటు భవనం నలుమూలల ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. అలాగే యూనివర్సిటీ ప్రారంభోత్సవం అనంతరం ఎస్ ఐ యు, శ్రీసిటీ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, కంపెనీల ప్రతినిధులు ఇలా పలువురిని ఆప్యాయంగా పలుకరిస్తూ ఫోటోలు దిగడం ద్వారా ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది.
